టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న చిత్రం సమ్మతమే. గోపినాథ్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కిరణ్ సరసన చాందిని చౌదరి నటిస్తోంది. యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Advertisement
జూన్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ తరుణంలోనే చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగాన్ని పెంచింది. అయితే ఇవాళ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో ఐలవ్ యూ కృష్ణ, అయ్యో ఈ పెళ్లికి ముందు ప్రేమ అనేది నాకు పడదండి. అందులో నేను పడను అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అయింది.
Advertisement
మరొక వైపు లవ్ అంటే తెలిదా.. ఇక్కడేమన్న ఎర్రి ఎదవ అని రాసుందారా.. అంటూ సద్దామ్ చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. పెళ్లికి ముందు ప్రేమలో పడను అంటూ ఓ యువకుడు ప్రేమలో పడగా.. ఆ యువకుడు తన ప్రేమను చివరికి గెలిపించుకుననాడా..? లేదా వారి ప్రేమకు వచ్చిన ఇబ్బందులు ఏమిటి..? అనేది ఈ చిత్రం కథగా తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చాందిని, కిరణ్‌ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. మొత్తానికి టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. టీజర్‌ను చూసిన వారిని సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా సినిమా చూడాలని ఆకర్షిస్తోంది.
Also Read :
మహేష్‌బాబుకు షాక్.. సోషల్ మీడియాలో సర్కారు వారి పాట ట్రైలర్..!
హోటల్ లో పని..రూ.500 జీతం…సమంత లైఫ్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయా…!