టాటా మోటార్స్ మరొకసారి విక్రయాల్లో వృద్దిని సాధించింది. జనవరిలో రికార్డు అమ్మకాలు జరిపింది. వినియోగదారుల వాహనాల విక్రయాలు 35వేల యూనిట్లకు చేరుకోగా.. ఇది అంతకు ముందు అత్యధికం 32వేల యూనిట్లుగా ఉండేది. అయితే ప్రస్తుతం కంపెనీ ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో 13 యకూనిట్ల వృద్ధిని సాధించింది. ఇటీవలే టాటా మోటార్స్ సీఎన్‌జీ వేరియంట్‌లో రెండు సరసమైన సెగ్మెంట్ కార్లను పరిచయం చేసింది.
Advertisement
అంతర్జాతీయ అమ్మకాల గురించి మాట్లాడినట్టయితే టాటా మోటార్స్ మొత్తం అమ్మకాలు జనవరి 2022లో 27 శాతం పెరిగి 76,210 యూనిట్లకు చేరుకున్నాయి. 2021 జనవరిలో కంపెఈన 59,866 వాహనాలను విక్రయించినట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. దేశీయ మార్కెట్ విక్రయాలు జనవరి 2022 ఏడాదికి 26 శాతం పెరిగి 72,485 యూనిట్లకు చేరుకున్నాయని తెలిపింది. నెలక్రితం ఇది 57,649 యూనిట్లుగా ఉంది. జనవరిలో టాటామోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉంది. గత నెలలో రెండు కార్లలో సీఎన్‌జీ వేరియంట్‌లను ప్రవేశపెట్టింది. వాటి పేర్లు టాటా టియాగో, టాటా టిగోర్ రెండు కంపెనీలను అమర్చిన సీఎన్‌జీ కిట్‌తో ప్రారంభించారు. దీంతో పాటు ఇందులో అనేక మార్పులు కూడా చేసారు.
Advertisement
సీఎన్‌జీ కార్లు తక్కువ పవర్ పెట్రోల్ ఇంజన్‌లపై ఆధారపడి ఉంటాయి. కంపెనీ i CAG టెక్నాలజీ 1.2 లీటర్ Revotron 3 సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించింది. ఇది 73.4 పీఎస్ పవర్, 0.95 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. రెండు కార్లు హర్మాన్ ద్వారా 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యూఎస్‌బీ ఛార్జీంగ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్ కనెక్టివిటి ఆండ్రాయిడ్ వంటి ఆధారిత వాయచిస్ కమాండ్ రికగ్నిషన్ వంటి పీచర్లతో వస్తున్నాయి..
Also Read : నిత్యం తుమ్ములు వస్తే.. తేలికగా అస్సలు తీసుకోవద్దు..!