Home » ఈ ముగ్గురు హీరోయిన్ల సినీ కెరీర్ ముగిసినట్టేనా.. వారు ఏం చేశారంటే..?

ఈ ముగ్గురు హీరోయిన్ల సినీ కెరీర్ ముగిసినట్టేనా.. వారు ఏం చేశారంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇండస్ట్రీ అంటేనే ఎప్పటికప్పుడు కొత్తవారు వస్తూ పోతూ ఉన్నవారికి అవకాశాలు తగ్గుతూ ఉంటాయి.. ఇందులో ముఖ్యంగా హీరోయిన్ల పరిస్థితి మాత్రం మరీ దారుణంగా ఉంటుంది.. ప్రేక్షకులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త అందాలను తీసుకువస్తూ తెరకు పరిచయం చేస్తూ ఉంటారు డైరెక్టర్లు.. అందుకే హీరోయిన్ల సినీ జీవితం 5 నుంచి 10 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది అని చెప్పవచ్చు. అది కూడా వారి పర్ఫార్మెన్స్ ను బట్టి ఉంటుంది. ఇందులో నటీనటులకు నటనతో పాటు గా కాస్త లక్ కూడా ఉండాలి అనేది ముఖ్యం. కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లతరబడి ఉన్న స్టార్డం రాక అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అందులో కొంత మంది హీరోయిన్ల గురించి ఇప్పుడు చూద్దాం..
రాశి కన్నా:

తెలుగు ఇండస్ట్రీలో రాశి ఖన్నా అంటే తెలియనివారుండరు. తన అందాలతో ఎంతోమంది ని మంత్రముగ్ధుల్ని చేసి ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ ఈ అమ్మడుకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఆమెతో పాటు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎంతో మంది హీరోయిన్లు మరియు ఆమె కంటే వెనుక వచ్చిన జూనియర్లు కూడా స్టార్ హీరోయిన్లు గా కొనసాగుతున్నారు.కానీ రాశిఖన్నా మాత్రం ఇప్పటికీ మీడియం హీరోయిన్ గానే ఉంటుంది. తాజాగా వచ్చిన థాంక్యూ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో ఈమె సినీ కెరియర్ ఆగిపోయినట్టే అంటున్నారు చాలామంది.
రెజీనా :

Advertisement

Advertisement

ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఏళ్ళు గడుస్తున్నా రెజీనా మాత్రం స్టార్డమ్ తెచ్చుకోలేక పోతోంది. చివరికి విలన్ పాత్రలు కూడా చేసిన ఆమెకు లక్కు కలిసి రావడం లేదు. ప్రస్తుతం ఈమె కెరియర్ కూడా చాలా కష్టం గా మారిపోయింది.
లావణ్య త్రిపాఠి :

తన అందాలతో అందరిని మాయ చేసిన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారయింది. టెన్ ఇయర్స్ ఇండస్ట్రీ లో ఉన్నా ఇప్పటికీ స్టార్ హోదా సంపాదించుకోలేక పోయారు. అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడుతోంది. దీన్ని బట్టి చూస్తే లావణ్య త్రిపాఠి సినీ కెరియర్ కి కూడా ఎండ్ కార్డ్ పడ్డట్టే కనిపిస్తోంది. వీరే కాకుండా టాలీవుడ్ లో ఇంకా చాలా మంది హీరోయిన్లను కూడా మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది.

also read:

Visitors Are Also Reading