Home » రాంచరణ్ గదిలోకి వచ్చిన కోతి.. ఆయన ఏం చేశారంటే..!!

రాంచరణ్ గదిలోకి వచ్చిన కోతి.. ఆయన ఏం చేశారంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

హనుమాన్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రత్యేక వీడియో ను పంచుకున్నారు. దీంతో ఆ వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ అవుతుంది. చిరు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక సుందరమైన వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా హీరో రామ్చరణ్ ఆచార్య సినిమాలో ఒక సన్నివేశానికి మేకప్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో గదిలోకి ఆకస్మికంగా ఒక కోతి వచ్చింది. ఆ కోతి రామ్ చరణ్ ని చూస్తూ ఉండిపోయింది. వెంటనే అది గమనించిన రామ్ చరణ్ దానికి కొన్ని బిస్కెట్లు ఇచ్చాడు. ఆ కోతి తన దగ్గర కూర్చొని తిన్నది.

Advertisement

అయితే ఈ వీడియో ఇంటర్నెట్ లో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన కూడా లభిస్తోంది. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం అందరికి తెలిసిందే. తన నటన అభినయంతో ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయారు. రెండు రోజుల క్రితమే రామ్చరణ్ తమిళ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

Advertisement

అలాగే మలయాళీ ప్రజలకు విషు శుభాకాంక్షలు తెలియజేసాడు. ఈ రెండు సందర్భాలలో అతను తన మాతృభాషలో శుభాకాంక్షలు. ఈ సందర్భంగా శంకర్ దర్శకత్వంలో తదుపరి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆచార్య సినిమాకు సంబంధించి చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే ఈ వీడియో బయటకు వచ్చింది. ఏది ఏమైనా హనుమాన్ జయంతి సందర్భంగా ఈ వీడియో నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతుందని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి :

హీరో సుమ‌న్ నీలిచిత్రాల‌ కేసులో ఇరికించింది ఎవ‌రు…? అర్ధరాత్రి పోలీసులు వచ్చి ఏమి చేసారంటే ?

Uday Kiran: ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు నటి సుధా కాళ్లుపట్టుకుని ఎందుకు ఏడ్చాడు ?

APRIL 16th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

 

Visitors Are Also Reading