Home » హిట్ 3 హీరోని రివీల్ చేసిన మేకర్స్.. సర్ ప్రైజ్ మామూలుగా లేదుగా..!

హిట్ 3 హీరోని రివీల్ చేసిన మేకర్స్.. సర్ ప్రైజ్ మామూలుగా లేదుగా..!

by Anji
Ad

యంగ్ అండ్ టాలెంటెడ్ పాన్ ఇండియా స్టార్ అడివి శేషు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం హిట్ 2. ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ చిత్రం ఉదయం నుంచి హిట్ టాక్ వచ్చేసింది. ముందు నుంచే హిట్ యూనివర్స్ ఫై క్రేజ్ పెరిగిపోతుంది. ఇప్పటికే హిట్టు ది ఫస్ట్ కేస్, హిట్ 2 ది సెకండ్ కేసు కూడా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. హిట్ 3 ఫై కూడా మరింత క్యూరియాసిటీ పెరిగింది.

Advertisement

ఇటీవల ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మూడో పార్ట్ తెరకెక్కించబోతున్నట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. మూడో పార్ట్ లో హీరో ఎవరనేది ఈ సినిమా క్లైమాక్స్ లో రివిల్ చేస్తామని తెలిపారు. దీంతో హిట్ 3 లో హీరో ఎవరు.? అడవి శేషు  నటిస్తారా? హీరోకి అవకాశం ఇస్తారా.? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ సందేహాలకు క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఎంతో క్యూరియాసిటీ నెలకొన్న హిట్ 3 సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించబోతున్నారని హిట్టు టు క్లైమాక్స్ లో తెలియజేశారు.

Advertisement

అర్జున్ సర్కార్ అనే బ్రూటల్ పోలీస్ ఆఫీసర్ గా హిట్ 3 లో నాని కనిపించబోతున్నారు. సాధారణంగా 100 మంది దోషులైన తప్పించుకోవచ్చు.. కానీ ఒక నిరపరాధి శిక్షించ బ డకూడదనేది చట్టం. అర్జున్ సర్కారు  పాలసీ అందుకు విరుద్ధం. తో పాటు సినిమాలు అడవి చేసి కూడా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ శైలేష్ కులం కథ సిద్ధం చేశారని.. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి రానున్నట్టు తెలుస్తోంది. ఇటు సిరీస్ కు ఇప్పటివరకు నిర్మాతగా ఉన్న నాని. హిట్ 3 లో హీరోగా కనిపించనున్నారు. ఇక హిట్ 3 లో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read :  హిట్ 2 ఓటీటీలోకి అప్పుడే.. ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే ?

Visitors Are Also Reading