Home » రిలీజ్ కి ముందే ‘ది కేరళ స్టోరీ’ సంచలనం.. వివాదం ఎందుకంటే ?

రిలీజ్ కి ముందే ‘ది కేరళ స్టోరీ’ సంచలనం.. వివాదం ఎందుకంటే ?

by Anji
Ad

మహిళల బలవంతపు మతమార్పిడి, రాడికలైజేషన్‌పై దృష్టి సారించిన ‘ది కేరళ స్టోరీ’  మూవీ ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. ముఖ్యంగా నిరసనల మధ్య సినిమా విడుదల సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి కోర్టు కూడా నిరాకరించింది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృతలాల్ షా నిర్మించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. ఈ చిత్రంలో ఆదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ నటించారు. మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం బలవంతపు మత మార్పిడి చుట్టూ కేంద్రీకృతమై ఉంది. 

Also Read :   ఎన్టీఆర్ సినిమాకెళ్లి చిరంజీవి దెబ్బలు తిన్నాడనే విషయం తెలుసా ?

Advertisement

కేరళలో సుమారు 32వేల మంది మహిళలు ఇస్లాం మతంలోకి మార్చబడ్డారని నివేదించబడింది. సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత వివాదం మరింత పుంజుకుంది. చిత్రం విడుదలపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబడింది. ఈ చిత్రం సెన్సార్ బోర్డు ఆమోదం పొందింది అని బెంచ్ చెప్పడంతో అభ్యర్థనను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సినిమా నిర్మాతలను “సంఘ్ పరివార్ ప్రచారం”గా అభివర్ణించారు. చిత్ర టీజర్ మొదట్లో “కేరళలోని 32వేల మంది ఆడవాళ్ళ హృదయ విదారకమైన గుండెను పిండేసే కథలు” అని విడుదలైంది. దీంతో అనేక విమర్శలు ఎదుర్కొంది చిత్ర యూనిట్.

Advertisement

అప్పుడు దానిని “కేరళకు చెందిన ముగ్గురు యువతుల నిజమైన కథలు”గా మార్చారు. కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ సినిమా నిర్మాతలు ప్రజలను వక్రధోరణి పట్టిస్తున్నారని ఆరోపించారు. థరూర్ కేరళలో 32,000 మంది మహిళలు ఇస్లాం మతంలోకి బలవంతంగా మారారని వచ్చిన ఆరోపణలను ఎవరైనా రుజువు చేస్తే వారికి రూ.1 కోటి ఇస్తానని ట్వీట్ చేశారు.సినిమా దర్శకుడు సుదీప్తో సేన్, నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా ‘ది కేరళ స్టోరీ’ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది అని చెబుతున్నారు. ఇక తమిళనాడులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయరాదని ఇంటిలిజెన్స్ బ్యూరో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం తమిళనాడులోని అన్ని థియేటర్లలో పొన్నియన్ సెల్వన్ 2 ఆడుతోందని ప్రభుత్వంతో పాటు ధియేటర్‌ యాజమానులు ది కేరళ స్టోరీని రిలీజ్‌ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేరళ స్టోరీకి బీజేపీ మద్దతు ఇవ్వడం మరో  విశేషం. 

Also Read :  జెమినీ గణేశన్ కు కొంతమంది టాలీవుడ్ వాళ్లు శత్రువులుగా ఉండటానికి కారణం అదేనా ?

Visitors Are Also Reading