నిఘా వర్గాల హెచ్చరికలు, దేశవ్యాప్త ఆందోళనలు, భారీ నిరసనల మధ్య ది కేరళ స్టోరీ చిత్రం బాక్సాఫీస్ ముందుకొచ్చింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సినిమాని నిలిపివేయాలని నిరసనలు ఓవైపు జరుగుతున్న బందోబస్తు నడుమ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా ప్రదర్శనపై కొచ్చిలోని పివిఆర్ సినిమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ థియేటర్స్ లో సినిమా ప్రదర్శనను నిలిపివేసింది.
Advertisement
ఇదిలా ఉంటే, కేరళలోని కొన్ని యదార్థ సంఘటనలు ఆధారంగా చేసుకొని సుదీప్తోసేన్ దర్శకత్వంలో విపుల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఆదాశర్మ, యోగితా బిహాని, సోనియా బలని, సిద్ధి ఇద్నని ముఖ్య పాత్రలు పోషించారు.
READ ALSO : X, Y, Z, Z+ కేటగిరి భద్రత అంటే ఏంటి? ఎవరికి ఈ భద్రత కల్పిస్తారు.
కథ మరియు వివరణ :
Advertisement
కేరళలోని కాసర్గాడ్ లోని నర్సింగ్ కాలేజీలో శాలిని ఉన్ని కృష్ణన్ (ఆదాశర్మ), నీమ (యోగితా బిహాని), గీతాంజలి (సిద్ధి ఇద్నని) చదువుకునే స్టూడెంట్స్. ఆసిఫా (సోనియా బలాని)తో కలిసి హాస్టల్ లో రూమ్ షేర్ చేసుకుంటారు. ఐసిస్ లో అండర్ కవర్ గా పనిచేసే ఆసిఫా అమ్మాయిలకు మాయమాటలు చెప్పి ఇస్లాం మతంలోకి మార్చే మిషన్ లో పనిచేస్తుంటుంది. తన మిషన్ లో భాగంగా ఇద్దరు ముస్లిం అబ్బాయిలను రంగంలోకి దించి గీతాంజలి, శాలినీతో లవ్ జిహాద్ ఉచ్చులోకి దించుతుంది. రమేష్ అనే అబ్బాయి ప్రేమలో పడిన శాలిని గర్భవతి అవుతుంది. పెళ్లి చేసుకోమని రమీజ్ ను అడికితే ఇస్లాం మతంలోకి మారితే వివాహం చేసుకుంటానని చెబుతాడు. దాంతో చేసేదేమీ లేక రమేష్ ను పెళ్లి చేసుకుని ఇస్లాంలోకి మారి సిరియాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఆఫ్గానిస్థాన్ లో అరెస్ట్ అవుతుంది. ఇక దీని వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
READ ALSO : అఖిల్ వల్ల భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న చరణ్..
‘ది కేరళ స్టోరీ’ స్క్రీన్ ప్లే కూడా చక్కగా కుదిరిందని చెప్పవచ్చు. సినిమా చూస్తున్న ప్రేక్షకులను చివరి వరకు సీట్లకు అలాగే కట్టిపడేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ముగ్గురు అమ్మాయిల జీవితాలు నాటకీయత మొదటి నుంచి చివరి వరకు సినిమా మూడు యాక్ట్ స్ట్రక్చర్ ని పర్ఫెక్ట్ గా అనుసరిస్తుంది అని చెప్పవచ్చు. ‘ది కేరళ స్టోరీ’ ఇతివృత్తంగా చూస్తే ఇది గొప్ప కథ. సినిమాలో హిందూ మతపరమైన ఆరాధన, నాస్తికత్వం, కమ్యూనిజం, ఇస్లాం, షరియ చట్టాలను బోధించే ప్రక్రియ లాంటివి చూపడం చాలా పెద్ద సవాళ్లే అనొచ్చు. ఇది సినిమాలో మరొక స్థాయి చర్చను లేవనెత్తుతుంది.
READ ALSO : “వయసు”తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్స్…!