తరచుగా కొత్త కార్లు మార్చే వారిలో ఒక అలవాటు ఉంటుంది. కొత్త సంవత్సరంలో కొత్తగా ఏదైనా కారు కొనుగోలు చేయాలని కొంతమంది ప్లాన్ చేస్తుంటారు. ఇంకొంత మంది కొత్త ఏడాది వస్తోంది కాబట్టి అప్పుడు ఆఫర్స్ ఉంటాయనే ఉద్దేశంతో ఇప్పుడు కారు కొనకుండా ఆగుతుంటారు. ఇక కొంతమందికి లగ్జరీ కార్లు కొనే అలవాటు ఉంటుంది. ఎంత ఖర్చు అయినా పర్లేదు కానీ, ఆ కారే కావాలంటారు. సరిగ్గా అలాంటి వ్యక్తి ఇప్పుడు ఓ లగ్జరీ కారు కొని హాట్ టాపిక్ గా మారాడు. హైదరాబాద్ నగరానికి చెందిన వ్యాపారవేత్త నసీర్ ఖాన్ తాజాగా అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేశారు.
READ ALSO : Google Top Search Heroines :ఇప్పటికీ ఆమెదే పై చేయి.. టాప్ సెర్చ్ హీరోయిన్ ఎవరంటే ?
Advertisement
Advertisement
సుమారు 12 కోట్లు పెట్టి అతను మేక్ లారెన్ 765 ఎల్ టి స్పైడర్ కారును కొన్నారు. ఇండియాలో ప్రస్తుత మార్కెట్ ప్రకారం అత్యంత ఖరీదైన సూపర్ కార్లలో ఇదొకటి. ఈ ఎలక్ట్రిక్ హార్డ్ టాప్ కారు ఓపెన్ కావడానికి 11 సెకన్ల సమయం పడుతుంది. కార్బన్ ఫైబర్ తో బాడీని తయారు చేశారు. కొత్త సూపర్ కారుకు చెందిన వీడియోను తన ఇన్ స్టా లో పోస్ట్ చేశాడు నసీర్ ఖాన్. ఇప్పటికే అతని గ్యారేజీలో రోల్స్ రాయిస్ కలినన్ బ్లాక్ బ్యాడ్జ్, ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్, మెర్సిడీజ్-బెంజ్ జి 350డి, ఫోర్డ్ ముస్టాంగ్, లంబోర్గిని అవేంటడార్, లంబోర్గిని ఉరుస్ లాంటి ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. మెక్ లారెన్ సంస్థ ఇండియా మార్కెట్ లోకి గత ఏడాది ఎంటర్ అయింది. గత ఏడాది బెంగాల్ కు చెందిన వ్యాపారవేత్త ప్రవీణ్ అగర్వాల్ కు 720 ఎస్ స్పైడర్ మోడల్ కారును మెక్ లారెన్ అందజేసింది. 765 ఎల్టి స్పైడర్ ను కొనుగోలు చేసిన తొలి భారతీయ వ్యక్తి నసీర్ ఖాన్ కావడం విశేషం.
అసలు ఈ నసీర్ ఖాన్ ఎవరు?
నసీర్ ఖాన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, వ్యాపారవేత్త మరియు కార్ల ఔత్సాహికుడు. హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి 3.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతను భారతదేశంలోని అతిపెద్ద కార్ల కలెక్టర్లలో ఒకడు. అతని వద్ద 20కి పైగా హై ఎండ్ కార్లు ఉన్నాయి. అతని కార్ల సేకరణలో సూపర్ కార్లు మరియు SUVలు ఉన్నాయి. అతని పూర్తి పేరు మహమ్మద్ నసీర్దుద్దీన్. అతని తండ్రి పేరు మిస్టర్ షానవాజ్, అతను కింగ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలను కలిగి ఉన్నాడు.
READ ALSO : చావు అంచుల దాకా వెళ్లిన నా భర్త ఎలా బ్రతికాడంటే… జబర్దస్త్ క్వీన్ వినోదిని భార్య ఎమోషనల్…!