మనలో టాలెంట్ ఉండాలే కానీ.. అది ఎలా అయినా ప్రదర్శించుకోవచ్చు. సుద్ద ముక్కలపై ఎన్నో అద్భుతమైన బొమ్మలు తీర్చిదిద్దిన వారున్నారు. బొద్దింకలపై పెయింటింగ్స్ వేసిన వాళ్లున్నారు. ఇక ఆకులపై ఎన్నో అందమైన చిత్రాలు గీసిన టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఉన్నారు. తాజాగా ఈ కలపై అద్భుతమైన చిత్రాలు గీసి ఔరా అనిపిస్తుంది లగ్మిమేనన్.
Also Read : రష్యాకు ఊహించని షాకిచ్చిన ఉక్రెయిన్..!
తన కళను ఏ ఒక్కదానికో పరిమితం చేయకూడదు అని కనిపించిన ప్రతిదానిపైన బొమ్మలు వేయాలనుకుంటుంది. అలా వస్తువుల నుండి పండ్ల వరకు ప్రతిదానిపై ప్రయత్నించింది. కానీ అవన్నీ ఇప్పటివరకు ఎందో వేసినవే. కొత్తగా చేయాలనుకున్నప్పుడూ ఈకలపై చేయాలన్న ఆలోచన వచ్చింది. వీటి మీద పెయింటింగ్ ఓ పట్టాన అతుక్కోదు. ఓ సవాలులా తీసుకుని ప్రయత్నించింది. చిన్న చిన్న బొమ్మల నుంచి మనుషుల చిత్రాల వరకు గీసింది.
తరువాత ఆకులపైన ఇదే పరిస్థితి ముడుచుకుపోయి పేయింటింగ్ అంతా ఒక దగ్గరికీ వచ్చేస్తోంది. దానిపైనా పట్టుసాధించి ఇప్పుడు అవలీలగా వేసేస్తోంది. వాస్తవానికి లగ్మి కి చిత్రకళపై అవగాహన తక్కువే. స్కూలు స్థాయిలో ప్రత్యేక తరగతి ఉన్నా.. స్నేహితుల సాయంతో నెట్టుకొచ్చేసింది. ఈమెది కేరళ. లాక్‌డౌన్ సమయంలో ఖాళీ ఉండకుండా ఏదైనా ప్రయత్నించాలనుకున్నప్పుడూ ఈ కళ తనను ఆకర్షించింది. ఆన్‌లైన్ కోర్సు చేసి, బొమ్మలు తనకంటూ ప్రత్యేకత ఉండాలనుకుని ఈకలు, ఆకులు, గింజలు ఇలా వివిధ రకాల వాటిపై ప్రయత్నిస్తోంది. తాను గీసిన వాటిని లచ్యూస్ లిటిల్ క్రియేషన్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టేది. వాటికి నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కడమే కాదు. తమకు చేసివ్వమని కోరడం మొదలు పెట్టారు. దీంతో కొంత మొత్తం తీసుకుని చేసించేది. ఈమె ప్రయత్నాలకు గుర్తింపు దక్కింది. ఒకే ఈకపై ఆరుగురు స్వాతంత్య్ర సమరయోధులను అరగంటలో గీసి ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది.
Also Read : ఊ అంటావా.. ఊహు అంటావా రెడ్డి అంటూ.. సీఎం జగన్‌పై RRR సెటైర్లు