Home » ఈ ఫోటోలో ఉన్న బాలిక తెలుగులో స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడు ఆమె నటించిన ఈ సీన్ చూస్తే ఫిదా అవుతారు..!!

ఈ ఫోటోలో ఉన్న బాలిక తెలుగులో స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడు ఆమె నటించిన ఈ సీన్ చూస్తే ఫిదా అవుతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతున్న కొంతమంది హీరో హీరోయిన్స్ చిన్నప్పుడు ఏదో ఒక సినిమాలో చైల్డ్ హుడ్ క్యారెక్టర్ లో చేసిన వారే.. అప్పుడు వారు సినిమాల్లో చేసి తర్వాత కొంతకాలం చదువు రీత్యా ఇండస్ట్రీ కి బ్రేక్ ఇచ్చారు.. అలా వారి చదువు పూర్తయిన తర్వాత కొంతమందేమో జాబ్స్ లు చేస్తూ సెట్ అయిపోయారు. కానీ ఇంకొంతమంది మళ్లీ నటనలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్,హీరో,సైడ్ క్యారెక్టర్స్ ఏదో ఒక విధంగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ కూడా ఉంది.. ఆమె ఎవరో కాదు మనందరికీ తెలిసిన కీర్తి సురేష్.. కీర్తి సురేష్ తల్లిదండ్రులు కూడా సినిమా నేపథ్యం నుంచి వచ్చిన వారే. ఆమె తండ్రి నిర్మాత సురేష్ కుమార్ మరియు తల్లి ఒకప్పటి హీరోయిన్ మేనక..

also read:Bigboss telugu6: టీ షర్ట్ లోపల చెయ్యి పెట్టి గెలికిన నో ప్రాబ్లం అంటూ.. రచ్చ చేస్తున్న గలాటా గీతూ..!!

Advertisement

Advertisement

కీర్తి సురేష్ 2000 సంవత్సరంలో బాలనటిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.. అలా మూడు సంవత్సరాలు ఇండస్ట్రీలో బాలనటిగానే కొనసాగింది.. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనర్ గా డిగ్రీ పూర్తి చేసి మలయాళ ఇండస్ట్రీ నుంచి గీతాంజలి సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఇక అప్పటి నుంచి మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు,తమిళ చిత్రాల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.. ఆమె తెలుగులో చేసిన సినిమాల్లో అందరినీ మెస్మరైజ్ చేసిన మూవీ మహానటి. ఈ మూవీలో నటించి అప్పటి సావిత్రి కి ఏ మాత్రం తీసిపోకుండా పలు సినీ రాజకీయ ప్రముఖులతో ప్రశంసలందుకుంది. నిజానికి ఈ సినిమా కీర్తి సురేష్ కెరీర్ ను మలుపు తిప్పిందని చెప్పవచ్చు..

ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ సఖి, మిస్ ఇండియా, గుడ్ లక్ వంటి సినిమాల్లో చేసినా అవి అంతగా ఫలితం ఇవ్వలేదు. ఇదే కాకుండా రజినీకాంత్ కు చెల్లిగా నటించిన సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.. ఆ తర్వాత మహేష్ బాబుతో నటించిన సర్కారు వారి పాట సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ అమ్మడు చిన్నప్పుడు నటించిన ఒక సినిమా క్లిప్పింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ లో చెల్లెలి పాత్రలో కనిపించబోతోందట. నాని హీరోగా వస్తున్న దసరా సినిమాలో కూడా హీరోయిన్ గా కీర్తినే నటిస్తోంది.

also read:

Visitors Are Also Reading