Home » ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం అదేనట..!!

ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం అదేనట..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది.. ప్రతిపక్షంలో ఉన్నటువంటి టిడిపి సరికొత్త ప్లానింగ్ తో ముందుకు వెళ్తోంది.. రాబోవు ఎన్నికల్లో ఎలాగైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికోసం వారికి అందిన ప్రతి అస్త్రాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో సభలు, సమావేశాలు రోడ్ షోలతో ప్రజల దగ్గరకు వెళ్తూ వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు.. ఈ తరుణంలో తాజాగా నెల్లూరులో పెట్టిన మీటింగ్ లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఫైల్ పై ముందుగా సంతకం పెడతానని అన్నారు.. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

Advertisement

also read:ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ రాఘ‌వేంద్ర‌రావు త‌ల్లా….ఆ వార్త‌ల్లో నిజం ఎంత‌..?

వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎలాగైనా విజయం సాధించాలని టిడిపి అనేక ప్రయత్నాలు చేస్తోంది.. ఇప్పటి నుంచే అధినేత ప్రజల్లోకి వెళ్తూ పలు హామీలు ఇస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకుంటున్నాడు. తాజాగా నెల్లూరు జిల్లా కావలిలో ఇదేం కర్మ మన బీసీలకు అనే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. బీసీలలో 140 పైగా కులాలు ఉన్నాయని, తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక అని, బీసీలకు ఎల్లప్పుడూ న్యాయం చేసే దిశలో టిడిపి ఉంటుందని హామీ ఇచ్చారు.. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలు కోల్పోయినటువంటి ప్రయోజనాలను వడ్డీతో సహా చెల్లిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Advertisement

అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం బీసీల సంక్షేమానికి సంబంధించిన అంశంపైనే పెడతానని హామీ ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి నాలుగు సంవత్సరాలైనా చేసింది ఏమీ లేదని , బీసీలకు అన్యాయం జరిగింది అంటూ ఎద్దేవా చేశారు . బీసీలకు ద్రోహం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ మాట్లాడారు. కాబట్టి బీసీలంతా ఏకమై టిడిపిని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. టిడిపి కోసం ఎవరైతే క్రమశిక్షణతో పనిచేస్తారో వారికి న్యాయం చేస్తానని తెలిపారు. పేద ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకొని, వారికి కావలసినవి ఏంటో అడిగి వాటిని మేనిఫెస్టోలో పెడతామని , అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి అమలుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు.

also read:

Visitors Are Also Reading