Telugu News » Blog » దామోద‌రం సంజీవ‌య్య : దేశంలోనే తొలి ద‌ళిత సీఎం రాజ‌కీయ ప్ర‌స్థానం గురించి మీకు తెలుసా..?

దామోద‌రం సంజీవ‌య్య : దేశంలోనే తొలి ద‌ళిత సీఎం రాజ‌కీయ ప్ర‌స్థానం గురించి మీకు తెలుసా..?

by Anji
Ads

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి రెండేండ్ల పాటు ముఖ్యమంత్రిగా ప‌ని చేసిన వ్య‌క్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దామోద‌ర సంజీవ‌య్య ఆయ‌న రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ద‌వీతో పాటు కేంద్ర క్యాబినేట్ మంత్రి ఆ త‌రువాత దాదాపు 8 ఏండ్లు రాష్ట్ర క్యాబినెట్ మినిస్ట‌ర్‌గా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షునిగా ప‌ని చేసిన త‌రువాత ఆయ‌న‌కు మిగిలింది కేవ‌లం రెండు అర్ర‌ల ఇల్లు మాత్ర‌మే. నేర అవినీతి ఆరోప‌ణ‌లు చేసి నెహ్రు దృష్టికి తీసుకువ‌చ్చిన‌ప్పుడు అక్క‌డికి వెళ్లిన వ్య‌క్తి సంజీవ‌య్య స్వ‌గృహాన్ని చూసి నివ్వెర‌బోయారు. అదేవిధంగా సంజీవ‌య్య గారి అమ్మ ఢిల్లీ నుంచి వ‌చ్చిన వారిని మా అబ్బాయికి జీతం పెరిగిందా అని అడ‌గ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

1921 ఫిబ్ర‌వ‌రి 14న క‌ర్నూలు జిల్లా ద‌గ్గ‌ర పెద్ద‌పాడులో జ‌న్మించిన సంజీవ‌య్య పుట్టిన రెండు రోజులే తండ్రిని కోల్పోయి మేన‌మామ‌ల స‌మ‌క్షంలో పేద‌రికంలో చ‌దువుకున్నారు. క‌ర్నూలు మున్సిపాలిటీ స్కూల్‌, అనంత‌పురం ఆర్ట్స్ క‌ళాశాల‌లో చ‌దువు కొన‌సాగించారు. చ‌దువు ప్రారంభ ద‌శ‌లోనే కొన‌సాగుతుందడ‌గా అనూహ్యంగా ఆయ‌న‌కు రాజకీయం వ‌చ్చే అవ‌కాశం వ‌చ్చింది.క‌ర్నూలు జిల్లాలో స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు న‌ర్స‌ప్ప‌ కు రెండు ప‌ద‌వులు ద‌క్కాయి. ఎంపీ, ఎమ్మెల్యేగా రెండు ప‌దవులుండ‌డంతో ఒక ప‌ద‌వీకి రాజీనామా చేశారు. ఎంపీ ప‌ద‌వీకి చ‌దువుకున్న వారు కావాల‌ని, ముఖ్య‌మంత్రి వాళ్ల‌తో చ‌ర్చించారు. ఎన్‌జీ రంగారావు సీతామ‌హాల‌క్ష్మ‌మ్మ వ‌ద్ద‌కు వెళ్లారు. ద‌ళిత కుటుంబం నుంచి చ‌దువుకున్న వ్య‌క్తి కావాల‌ని అడ‌గ‌గానే ఆమె సంజీవ‌య్యను ప‌రిచ‌యం చేసింది. అత‌ను చురుకైన వార‌ని, కేవ‌లం 28 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే ఉన్నాయ‌ని, అప్పుడు ఆయ‌న‌కు రాజ‌కీయం ప‌ట్ల ఏమాత్రం ఆస‌క్తి లేదు. 1950లో పార్ల‌మెంట్ స‌భ్య‌త్వం త‌రువాత ముఖ్య‌మంత్రి అయ్యేవ‌ర‌కు వ‌రుస‌గా ఎమ్మెల్యేగా ఎన్నిక‌వుతూనే ఉన్నారు. రిక్షాలోనే అసెంబ్లీకి అడుగు పెట్టాడ‌ట‌.

చ‌క్ర‌వ‌ర్తుల రాజ‌గోపాల గోపాల‌చారి, మంత్రి వ‌ర్గంలో త‌రువాత ప్ర‌త్యేక ఆంధ్ర రాష్ట్రంలో టంగుటూరి ప్ర‌కాశం పంతులు, బెజ‌వాడ గోపాల‌రెడ్డి క్యాబినెట్ త‌రువాత తెలంగాణ‌తో క‌లిసిన ఉమ్మ‌డి రాష్ట్రంలో నీలం సంజీవ‌రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా ప‌ని చేశారు.1960లో సంజీవ‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా దిగిపోయారు. అప్పుడు ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రిగా దామోద‌ర సంజీవ‌య్య ప‌ద‌వీ స్వీక‌రించారు. భార‌త‌దేశ తొలి ద‌ళిత ముఖ్య‌మంత్రిగా రికార్డుల‌కు ఎక్కారు. ఆ స‌మ‌యంలో అల్లూరి స‌త్య‌నారాయ‌ణ రాజు నీలం సంజీవ‌రెడ్డిని మంత్రిని కానివ్వ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే సంజీవయ్య‌ను ఎంచుకున్నారు. ఎస్సీ, ఎస్టీల‌కు ఉద్యోగాల్లోనే కాకుండా ప్ర‌మోష‌న్ల‌లో కూడా రిజ‌ర్వేష‌న్‌ల‌ను ప్రారంభించారు. మండ‌ల క‌మిష‌న్ రాక‌ముందే బీసీల‌కు 27 శాతం రిజ‌ర్వేష‌న్లు కల్పించారు. ముఖ్య‌మంత్రి హోదాలో 6లక్ష‌ల ఎక‌రాల భూముల‌ను పేద‌ల‌కు పంపిణీ చేశారు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని గౌర‌వించి కేవీ రంగారెడ్డికి డిప్యూటీ సీఎం ప‌ద‌వీ అప్ప‌గించారు.

Also Read :  My Story నాకు 40., త‌న‌కు 20.! ఇది మా స్టోరి!

1961లో మొద‌టిసారి అవినీతి నిరోధ‌క శాఖ‌ను ప్రారంభించారు దామోద‌ర సంజీవ‌య్య‌. గాజుల దిన్నె, వ‌ర‌ద‌రాజుల‌, వంశ‌ధార‌, పులిచింత‌ల వంటి ప్రాజెక్ట్‌ల‌కు శంకుస్థాప‌న చేశారు. నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్ట్ చురుగ్గా పూర్త‌వ్వ‌డానికి ఆస‌క్తి చూపించారు. వ్య‌వ‌సాయ‌, ప‌రిశ్ర‌మ రంగాల‌పై దృష్టి సారించారు. తొలుత వృద్ధాప్య పింఛ‌న్ల‌ను ప్రారంభించింది సంజీవ‌య్య‌నే కావ‌డం విశేషం. తొలిసారి రూ.25 ఫించ‌న్ ప్రారంభించాడు. పింఛ‌న్ ప్రారంభించ‌డానికి కార‌ణం సంజీవ‌య్య త‌ల్లిగారేన‌ట‌. రాజకీయాల్లోకి వెళ్లుతున్నాను అమ్మ అని చెప్పి రూ.100 ఇవ్వ‌డంతో వాళ్ల అమ్మ ఇవి అయిపోగానే ఎవరినీ అడ‌గాలి అని అన‌డంతో అప్పుడు ఆయ‌న‌కు పింఛ‌న్ ఆలోచ‌న త‌ట్టింద‌ట‌.

ముఖ్య‌మంత్రి ప‌ద‌వీలో ఉంటూ కూడా కుల వ్య‌వ‌స్థ‌ను ఎదుర్కున్నాడు. నెల్లూరు జిల్లాకు చెందిన శ‌క్తిమంత‌మైన నాయ‌కుడు చెంచు సుబ్బారెడ్డిని మంత్రి ప‌ద‌వీ నుంచి తొల‌గించే వ‌ర‌కు వెళ్లింది. తెలంగాణ‌, రాయ‌ల‌సీమ, అగ్ర‌వ‌ర్ణాలు నెల్లూరులో చాలా కించ‌ప‌రుస్తూ మాట్లాడారు. 1967లో జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల్లో క‌ర్నూలు నుంచి జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌డంతో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాలు అన్ని ఏక‌మై సంజీవ‌య్య‌ను ఓడించారు. ఎన్నిక‌ల త‌రువాత 1962లో అప్ప‌టి ప్ర‌ధాని నెహ్రు సంజీవ‌య్య‌ను కాంగ్రెస్ అధ్య‌క్షునిగా నియ‌మించారు. ఆ ప‌ద‌వీ చేప‌ట్టిన తొలి ద‌లిత పౌరుడు సంజీవ‌య్య‌. నెహ్రుగారు సార్ అన‌డంతో సంజీవ‌య్య ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌.

 

తన జీవితానికి సంబంధించి ఒక సీస ప‌ద్యం కూడా రాసుకున్నార‌ట సంజీవ‌య్య‌. భీష్మ జ‌న‌నం అనే హ‌రిక‌థ కూడా రాశార‌ట‌. ముఖ్యంగా పాట‌లు పాడుతూ, ఆట‌లాడుతూ ఆయ‌న బ‌హిరంగ స‌భ‌ల్లో మాట్లాడితే జ‌నాలు ఎంతో ఆస‌క్తిగా వినేవారు. సంజీవ‌య్య‌కు పిల్ల‌లు లేరు. ఒక అమ్మాయిని ద‌త్త‌త తీసుకున్నారు. ఆయ‌న డ‌యాబిటిస్ తో బాధ‌ప‌డేవారు. 1972 మే 05న దామోద‌రం సంజీవ‌య్య మ‌ర‌ణించారు. ముఖ్యంగా ఆయ‌న ఉన్నంత సేపు అంద‌రితో స‌ర‌దాగా గ‌డిపేవార‌ట సంజీవ‌య్య‌.

Also Read :  ఎన్టీఆర్ కండిష‌న్‌ను బ్రేక్‌ చేసిన కైకాల‌ స‌త్య‌నారాయ‌ణ.. ఎందుకో తెలుసా..?


You may also like