Home » చీపెస్ట్ ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది.. కిలోమీటర్ కి 75 పైసలు మాత్రమే ఖర్చు..!

చీపెస్ట్ ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది.. కిలోమీటర్ కి 75 పైసలు మాత్రమే ఖర్చు..!

by Anji
Ad

 భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల హవా కొనసాగుతుంది.  మార్కెట్ లో డిమాండ్ కి తగినట్టు ఆట మొబైల్స్ కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు తీసుకొస్తున్నాయి. తాజాగా ముంబై బేస్ డ్ పీఎంవీ ఎలక్ట్రిక్ కంపెనీ అతి తక్కువ ధరతో మైక్రో ఎలక్ట్రిక్ కారు EAS-E ని లాంచ్ చేసింది. భారత్ లో ఇప్పటి వరకు లాంచ్ అయినటువంటి అన్ని ఎలక్ట్రిక్ కార్లలో అత్యంత చిన్నది ఇదే కావడం విశేషం. ఈ వెహికల్ సింగిల్ ఛార్జీపై 120 నుంచి 200 వరకు రేంజ్ ఆఫర్ చేస్తుంది. నానో సైజు ఉన్న ఈ ఎలక్ట్రిక్ కారును రూ.4.79 లక్షల కే పీఎంవీ కంపెనీ పరిచయం చేసి ఇప్పుడు అందరి  దృష్టిని ఆకట్టుకుంటోంది. దీని ప్యూచర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

పీఎంవీ ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి విడుదలైన తొలి ఎలక్ట్రిక్ కారు Eas-E బేస్ వేరియంట్  మొదటి 10వేల మంది కస్టమర్లకు రూ.4.79 లక్షల ఇంట్రడక్టరీ ప్రైస్ కి లభిస్తుంది. హై ఎండ్ బ్యాటరీ ఫ్యాక్ వెర్షన్లు వరుసగా రూ.6.79 లక్షలు రూ.7.79 లక్షలుగా ఉన్నాయి. కొద్ది రోజుల కిందటే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే తమ  Eas-E కారు కోసం రూ.6,000 ప్రీ ఆర్డర్ నమోదైనట్టు కంపెనీ ప్రకటించింది. Eas-E ఈవీ 2 ఫ్యాసింజర్ సీటింగ్ కెపాసిటీతో వస్తుంది. ఇద్దరూ పెద్దవాళ్లు, చిన్న వయసు ఉన్న ఒక బాలిక లేదా బాలుడు కూడా కూర్చోవచ్చు. ఇది మొత్తం 36 చదరపు అడుగుల విస్తీర్ణంతో వస్తుంది. దీని పొడవు 2,915 మి.మీ., వెడల్పు 1,157 మిమీ, ఎత్తు 1,600 మిమీ వీల్ బేస్ 2,087 మిమీ పొడవు ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 170 మి.మీ. కర్బ్ వెయిట్ దాదాపు 550 కేజీలు ఉంటుంది.

Advertisement

Also Read :  తల్లిదండ్రులు పిల్లల ముందు చేయకూడని పనులు.. 2 చాలా ఇంపార్టెంట్..!!

jjjj

చాలా తక్కువ పరిమాణంలో వస్తున్న ఈ కారు సిటీ ట్రాఫిక్ లో బైకు మాదిరిగా ఈజీగా దూసుకెళ్తోంది.  Eas-E కారులో రిమోట్ పార్కు అసిస్ట్, రిమోట్ హార్న్, ఫాలో మీ హోం లైట్లు, రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి పలు స్మార్ట్ ఫీచర్లున్నాయి. ఈ కారుకు ఓవర్ ది ఎయిర్ అప్ డేట్లను కంపెనీ ఆఫర్ చేయనుంది. ఏసీ, లైట్లు, విండోస్, హారన్ లను రిమోట్ గా కంట్రోల్ చేయడానికి మొబైల్ అప్లికేషన్ వంటి ఫీచర్లతో ఇది వస్తోంది.  Eas-E మైక్రో కారు 10 K W శక్తిని 50 NM టార్క్ ని ఉత్పత్తి చేసే PMSM మోటార్ తో వస్తుంది. ఈ మోటార్ తో కారు గరిష్టంగా 70 KMPH వరకు వేగాన్ని అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ మూడు బ్యాటరీ ఫ్యాక్ ఆప్షన్ తో వస్తుంది. బేస్ వేరియంట్ 120 KM రేంజ్ అందిస్తే మిగతావి 160  KM, 200  KM రేంజ్ ఆఫర్ చేస్తాయి. ఈ మూడు వేరియంట్లను ఫుల్ గా ఛార్జ్ చేయడానికి 3 నుంచి 4 గంటల మధ్య సమయం పడుతుంది. ఈ EV కిలోమీటర్ కి 75 పైసల కంటే తక్కువ రన్నింగ్ కాస్ట్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. IP67 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ తో కారు బ్యాటరీలు వస్తాయి. 

Also Read :  సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలకు నాగార్జున ఎందుకు రాలేదు ?

Visitors Are Also Reading