Telugu News » Blog » ఈ 5 రాశుల వారికి 2023 బడ్జెట్ కలిసొస్తుందట.. వచ్చే నెలలో అదృష్టవంతులు..!

ఈ 5 రాశుల వారికి 2023 బడ్జెట్ కలిసొస్తుందట.. వచ్చే నెలలో అదృష్టవంతులు..!

by Anji
Ads

2023-2024 ఏడాదికి సంబంధించి వార్షిక బడ్జెట్ ని ఫిబ్రవరి 01న కేంద్ర ప్రభుత్వం సమర్పించనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ని ప్రవేశపెడుతారు. అయితే ఈ ఏడాది బడ్జెట్ కి ముందు శనితో సహా పలు ప్రధాన గ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయి. దాదాపు దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ ఏడాది బడ్జెట్ కొన్ని రాశులకు కొత్త ఆశలు, కొత్త కలలు, కొత్త లక్ష్యాలు, కొత్త సవాళ్లను తీసుకురాబోతుంది. 2023కి సంబంధించిన బడ్జెట్ ఏయే రాశుల వారికి లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

మేష :

మేష రాశి వారికి గ్రహాలు, నక్షత్రాలు గమనం శుభఫలితాలను ఇస్తుంది. బడ్జెట్ తరువాత మీ యొక్క ఆర్థిక పరిస్థితిలో పెద్ద మార్పులు సంభవిస్తాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత పదవులు పొందుతారు. సామాజిక గౌరవం లభిస్తుంది. 

వృషభం :

గ్రహ రాశుల ప్రభావంతో వృషభ రాశి వారిపై చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఈ సమయంలో సామాజిక హోదాలో పెరుగుదల ఉంటుంది. శని గ్రహంతో వృషభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ధనలాభం కలుగుతుంది. ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందుతారు. 

Advertisement

సింహ :

సింహ రాశికి అధిపతి అయినటువంటి శని.. ఈ రాశిలోని 10వ గృహంలో సంచరిస్తుంది. ప్రభావంతో ప్రభుత్వ రంగంలో పని చేసే వ్యక్తులు భారీ లాభాలను పొందుతారు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఈ సమయం మీకు ఒక వరంలాంటిది. 

కన్య :

కన్యరాశి వారి జాతకంలో బృహస్పతి, రాహువుల సంచారం ఆకస్మిక ప్రయోజనాలను ఇస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో పని చేసే వారు గొప్ప ప్రయోజనం పొందుతారు. రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులు పెద్ద విజయం సాధించగలరు. 

మకర : 

ఈ రాశి వారికి పెద్ద బహుతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు పుష్కలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పని చేసే వ్యక్తులు బోనస్ పొందవచ్చు. శని దేవుడి అనుగ్రహంతో ఉన్నత పదవీని అధిరోహిస్తారు. 

Advertisement

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి నష్టాలు వచ్చే అవకాశముంది

You may also like