Home » Astrology : ఆ రాశుల వారి పిల్లలు పుడుతూనే తండ్రి త‌ల‌రాత మారుస్తార‌ట‌..!

Astrology : ఆ రాశుల వారి పిల్లలు పుడుతూనే తండ్రి త‌ల‌రాత మారుస్తార‌ట‌..!

by Anji
Ad

Astrology : జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం.. కొన్ని రాశి వారి పిల్ల‌ల‌ను చాలా అదృష్ట‌వంతులుగా ప‌రిగ‌ణిస్తారు. వారు పుట్టుక‌తోనే ల‌క్కీ అని చెప్ప‌వ‌చ్చు. వారి తండ్రి త‌ల‌రాత‌ను కూడా మార్చే మ‌హాజాత‌కులు అనే చెప్ప‌వ‌చ్చు. అదృష్టం ఉన్న‌వారు ఏ ప‌ని చేసినా పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నే లేదు. వీళ్లు త‌క్కువ శ్ర‌మతోనే అన్ని పొందుతారు. అలాంటి కొన్ని రాశుల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

 

మిథున రాశి :

Mithuna Rashi

Mithuna Rashi

ఈ రాశిలో జ‌న్మించిన పిల్ల‌లు చాలా తెలివైన వారు. క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే త‌త్వం క‌ల‌వారు. అన్నింటిలో వారు ముందంజ‌లోనే ఉంటారు. ఈ రాశివారు ప్ర‌తి విష‌యంలోనూ విజ‌యం సాధిస్తారు. అంతేకాదు.. ఈ రాశివారు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో కూడా అత్యంత ప్రేమ‌గా ఉండి అందించేంత గౌర‌వం పొందుతారు. అందుకే తండ్రికి చాలా అదృష్ట‌వంతులుగా ప‌రిగ‌ణిస్తారు.

క‌న్య రాశి :

Advertisement

ఈ రాశి వారి మెద‌డు చాలా స్పీడ్‌గా పని చేస్తుంటుంది. వీరి ప‌దునైన తెలివి, ల‌క్ కార‌ణంగా వేగంగా అభివృద్ధి చెందుతారు. అంతేకాదు ఈ వ్య‌క్తులు ప్ర‌తి చోటా సొంత గుర్తింపును సృష్టించుకుని ఎల్ల‌ప్పుడూ విజ‌యం సాధిస్తారు. వీరికి సంప‌ద, సుఖాల‌కు లోటులేదు. వారి తెలివి తేట‌ల వ‌ల్ల ప‌ని చేసే ప్ర‌తి చోటా ఓ ప్ర‌త్యేక గుర్తింపును సృష్టించుకుంటారు. ఈ రాశివారు త‌మ తండ్రికి కూడా అదృష్టాన్ని తీసుకొస్తారు.

ధ‌న‌స్సు రాశి

ఈ రాశి వారికి అధిప‌తి గురువు. ఈ రాశి వారు త‌మ ప్ర‌తి ప‌నిని బృహ‌స్ప‌తి ప్ర‌భావంతో పూర్తి అవుతుంది. ధ‌న‌స్సు రాశి వారికి బృహ‌స్ప‌తి ప్ర‌త్యేక అనుగ్ర‌హం ఇంట్లో ఆనందం. శ్రేయ‌స్సు తెలుస్తుంది. ఈ రాశి గ‌ల‌ పిల్ల‌లు చాలా అదృష్ట‌వంతులే. వీరు వెళ్లే ఇంట్లో ల‌క్ష్మిదేవి కొలువు అయి ఉంటుంద‌ని చెబుతుంటారు.

Also Read : 

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి కుటుంబ స‌హ‌కారం అందుతుంది

ప్ర‌ణ‌య్ త‌ర‌హా క‌థ మ‌రో యువ‌కుడికి.. వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడ‌ని..!

Visitors Are Also Reading