మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కిన విషయం విధితమే. ఆచార్య సినిమా విడుదలకు ముందే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక విడుదలయ్యాక మిక్స్‌డ్ టాక్ వినిపించినా.. చాలా వరకు నెగిటివ్ టాక్ రావడంతో సినిమా థియేటర్ వద్దకు వెళ్లే జనాలు అంత ఆసక్తి కనబరచలేదు. ఇక చిరంజీవి సినిమాలను ప్రేక్షకులు తిరస్కరించడం ఇదేమి కొత్త కాదు.
Advertisement
సినిమా ఏవిధంగా ఉన్నా సరే తమ అభిమాన హీరో సినిమా ఒకసారి చూడాల్సిందేనని కొందరిలో ఉంటుంది. అభిమానులకు తెరమీద తమ హీరో కనిపిస్తే చాలు.. అది ఓ ఆనందం.. తమిళంలో రజినికాంత్‌కు తెలుగులో చిరంజీవికి పాపులారిటీ ఆవిధంగా ఉంటుంది. కానీ తాజాగా చిరంజీవి ఆచార్య సినిమాకు మాత్రం అలాంటి పాపులారిటీ అసలు కనిపించలేదనే చెప్పాలి. ఏదో తేడా భారీగానే కొట్టేసిందనే లెక్క.
దాదాపుగా ఆచార్య విడుదలైన మెజార్టీ థియేటర్లలో ఇవాళ నుంచి కేజీఎప్-2 సినిమా నడిపిస్తున్నట్టు సమాచారం. ఏపీలో సీఎం జగన్‌ను ఎంత బతిమిలాడి టికెట్ ధరలు పెంచుకున్నా ఫలితం లేకుండానే పోయింది. ఓ వైపు ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమాల కారణంగా ఆచార్యకు అనుకున్నంతగా థియేటర్లు లభించలేదు. ఇక ముఖ్యంగా మెగాస్టార్ అంటే క్రేజీ ఉన్న జిల్లాలలో కూడా కొన్ని థియేటర్లలో అసలు బ్యానర్లు కూడా కట్టలేదంటే అర్థం చేసుకోవాలి. చిరంజీవి పలుమార్లు జగన్ వద్దకు వెళ్లడం అభిమానులకు కూడా నచ్చలేదనే టాక్ వినిపిస్తోంది.
Advertisement
వాస్తవానికి ఆచార్య సినిమా దర్శకుడు కొరటాల శివనే బలి చేయడం అసలు కరెక్ట్ కాదు. చిరంజీవి తన సినిమాలకు సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. పలు సూచనలు కూడా చేస్తుంటాడు. ప్రత్యేకంగా తనకు ఉన్న ఇమేజ్‌కు తగ్గట్టు ప్రత్యేక పాటలు, క్లైమాక్స్ అన్ని ప్రతి ఒక్కటి చూసుకుంటాడు. దర్శకుడు కొరటాల శివది మాత్రమే పూర్తి బాధ్యత కాదు. ప్రస్తుతం నాలుగు ఫైట్లు, నాలుగు పాటలు అనే ఫార్ములా ఇప్పుడు అసలు నడవడం లేదు అని చిరంజీవి గుర్తించలేనట్టుంది. చిరంజీవి సినిమాకు సంబంధించి ఏ అంశంలోనైనా అల్లు అరవింద్ నిర్ణయాధికారాలుంటాయి. కానీ ఈ సినిమా విషయంలో కలుగజేసుకోలేదట. థియేటర్ల నుంచి సినిమాను ఎత్తేయడంతో కనీస కలెక్షన్లు కూడా భారీగానే లోటు తప్పదనే విషయం స్పష్టం అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ప్లాప్ అయిన వాటిలో అత్యంత ఘోర పరాభవం ఎదురైన సినిమా ఆచార్య అనే చెప్పుకోవాలి.
Also Read :
అన్నగారిని స్టైలిష్ స్టార్ ను చేసిన సినిమా ఏదో తెలుసా…? ఈ సినిమా తరవాతే యూత్ ఐకాన్ అయ్యాడు…!
కథ నచ్చినా వాళ్ళ కోసమే కృష్ణ “స్నేహంకోసం”” సినిమాను రిజెక్ట్ చేశారన్న సంగతి తెలుసా…!