మనదేశంలో చాలామంది కుడిచేతితో రాస్తే… మరికొంతమంది ఎడమ చేతితో రాస్తారు. అలాగే కొంతమంది రెండు చేతులతో రాస్తారు. ఇందులో ఎడమ చేతితో రాసే వారికి తెలివి ఎక్కువగా ఉంటుంది అని అంటుంటారు. అయితే ఎలాంటి అలవాట్లు ఉన్న వారికి తెలివి ఎక్కువగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.
Advertisement
మన దగ్గర నవ్వించే వారిని జోకర్స్ గా వారికి ఏమీ తెలియదు అన్నట్లుగా చూస్తూ ఉంటారు, కానీ ఒక పరిశోధన ప్రకారం నవ్వించే వారికే ఎక్కువ తెలివి ఉంటుంది అని తెలిసింది. అలాగే బక్కగా ఉన్న వారికి ఎక్కువ ఐక్యూ ఉంటుంది అని మరో పరిశోధనలో బయట పడింది. ఓ తల్లికి పుట్టిన బిడ్డలలో మొదటి సంతానానికి 19, 20 ఏళ్లు ఉన్నప్పుడు వారికి ఎక్కువ ఐక్యూ ఉంటుందని తేలింది. ఇక మన దేశంలో రాత్రి పూట చాలామంది పని చేస్తుంటారు. అలా రాత్రి పని చేసే వారికి కూడా ఎక్కువ తెలివి ఉంటుందని నిపుణులు తేల్చారు
Advertisement
ఇక తల్లిపాలు తాగిన పిల్లలకు కూడా ఐక్యూ బాగా ఉంటుందని… చిన్నప్పుడు తల్లి ఇచ్చే పాలు పిల్లల తెలివి పెంచడానికి ఉపయోగపడతాయని పరిశోధకులు తెలిపారు. అలాగే మనదేశంలో సైలెంట్ గా ఉండే వారిని చాలా తక్కువ అంచనా వేస్తారు. కానీ అలాంటి వారిలో 60 శాతం పైగా తెలివిగలవారు ఉంటారని నిరూపించబడింది. ఇవన్నీ ఓ లెక్క అయితే మన దేశంలో కొంతమంది దేవుని నమ్ముతారు. మరికొంత మంది నమ్మరు. అయితే దేవుడిని నమ్మని వారే ఎక్కువ తెలివి కలవారని ఓ పరిశోధన చెప్తుంది. ఎందుకంటే… దేవుడిని నమ్మే వారు తమ సమస్యల భారాన్ని ఆయన పైనే వదిలేస్తారు. కానీ నమ్మనివారు తమ సొంతంగా సమస్యలను ఎదుర్కొంటారు.