Telugu News » Blog » అందుకోసమే వైసిపి ప్రచారానికి వెళ్లాను.. లేదంటే వెళ్లే వాడినికాదు.. MB కామెంట్స్ వైరల్..!

అందుకోసమే వైసిపి ప్రచారానికి వెళ్లాను.. లేదంటే వెళ్లే వాడినికాదు.. MB కామెంట్స్ వైరల్..!

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు అంటే తెలియని వారు ఉండరు. కలెక్షన్ కింగ్ గా మంచి గుర్తింపు సాధించారు. ఆయన ఇండస్ట్రీలో చేయని పాత్ర అంటూ లేదు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా, విద్యావేత్తగా ఇలా ప్రతిదాంట్లో ఆయన గుర్తింపు సాధించారు. అలాంటి మోహన్ బాబు తన కెరియర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి ఆ తర్వాత హీరోగా అనేక సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి మోహన్ బాబు తన కెరీర్ లో ఎన్నో కష్టాలు పడ్డానని , ఆ కష్టాలు పగవాడికి కూడా రాకూడదని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు..

Advertisement

also read:హరికృష్ణ వల్లే jr: ఎన్టీఆర్ ఆస్కార్ లెవెల్ కి వెళ్లారా..?

 

ఈ సందర్భంగా ఆయన పాలిటిక్స్  పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఏ సంఘటనతో మీకు రాజకీయాలపై విరక్తి కలిగింది అని ఒక జర్నలిస్టు ప్రశ్నించగా.. సమాధానంగా మోహన్ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం ఆ విషయం అప్రస్తుతం.. ఎప్పుడో జరిగిన దానిని మళ్లీ గుర్తు చేసుకోవద్దు అన్నారు. ఇక టిడిపి క్రమశిక్షణ రహిత్య కారణంగానే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారా అని విలేకరి ప్రశ్నించగా..

Advertisement

also read:ఆయన వల్లే ఇల్లు కొనుక్కున్న అంటున్న రచ్చ రవి..!!

ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం జరిగిన దాని గురించి ఇప్పుడు ఎందుకని.. గతం గతః. వీటి గురించి ప్రస్తుతం జనాలకు అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చారు.. అంతేకాదు ప్రస్తుతం వైసీపీలో మీ ప్రాధాన్యం ఏమిటి అని అడగగా.. నేను 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రచారాన్ని వెళ్లడానికి ప్రధాన కారణం సీఎం జగన్ మా బంధువు కావడం.. అంతే తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. నాకేమో పదవులు వస్తాయని ఆశించి ప్రచారానికి వెళ్లలేదు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మోహన్ బాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీలో రాజకీయ వర్గాల్లో చర్చనియంశంగా మారాయి. మరి దీనిపై మీ కామెంట్స్ ఏంటో చెప్పండి.

Advertisement

also read:జై చిరంజీవ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!