Home » ఆ హీరో సినిమాకు వెళ్లి.. అడ్డంగా బుక్కయిన సాయిపల్లవి..!!

ఆ హీరో సినిమాకు వెళ్లి.. అడ్డంగా బుక్కయిన సాయిపల్లవి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటారు పెద్దలు.. అలాంటి ట్రిక్ ఫాలో అవుతుంది సాయి పల్లవి. ఆమె చాలా సింప్లిసిటీ గా న్యాచురల్ గా ఉంటుంది. సినిమాల్లో కూడా ఆ విధమైన పాత్రలు మాత్రమే చేస్తుంది సాయిపల్లవి. ఆమె ఏ మూవీ చూసిన హీరోయిన్ స్పెషల్ కేటగిరి ఉంటుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఫిదా మూవీ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన కోలీవుడ్ అమ్మడు సాయి పల్లవి. ఎప్పుడు కూడా న్యాచురల్ గా పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ ముఖం నిండా నవ్వుతో కనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైన పెర్ఫార్మెన్స్ తో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది ఆమె. సాయి పల్లవి స్టార్ హీరోయిన్ కావడం వలన ఎక్కడికి వెళ్ళినా అభిమానుల ఆదరాభిమానాల వల్ల ప్రైవసీ చాలా కష్టమవుతోంది. అయితే ఈ అమ్మడు చాలా వెరైటీ. తనకు ఇష్టమైన హీరోల సినిమాలు వస్తే సాధారణ అమ్మాయిలగా వెళ్లి మూవీస్ చూడాలి అనుకుంటుంది..ఇక అనుకోవడమే కాకుండా సింపుల్ గా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కి బంజారాహిల్స్ లోని పీవీఆర్ ఆర్కె సినీ ప్లెక్స్ లో మూవీ చూసింది. అయితే ఈ అమ్మడు తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని ముఖాన్ని కవర్ చేస్తూ తలపై ఒక స్కార్ఫ్ ధరించి, ముఖానికి మాస్కు పెట్టుకుని చేతిలో హ్యాండ్ బాగ్ పట్టుకుని థియేటర్ కి వెళ్ళింది… ఎవరు చూడరనుకున్న సందర్భంలోనే ఒక వ్యక్తి ఆమెను గుర్తించి తన కెమెరా ద్వారా క్లిక్ మనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Advertisement

ALSO READ;

ఒకే ఫ్రేమ్‌లో అక్కినేని కుటుంబం.. అక్కడ ఎవ్వ‌రు మిస్ అయ్యారంటే..?

పాపం కొరటాల శివ.. ఆచార్య మూవీకి ఎన్ని కోట్లు కట్టారంటే..!!

 

Visitors Are Also Reading