Home » లైవ్ మ్యాచ్ లో కోహ్లీ కాళ్లు పట్టుకున్న వీరాభిమాని.. ఫ్యాన్స్ మనస్సు గెలుచుకున్న సూర్య..!

లైవ్ మ్యాచ్ లో కోహ్లీ కాళ్లు పట్టుకున్న వీరాభిమాని.. ఫ్యాన్స్ మనస్సు గెలుచుకున్న సూర్య..!

by Anji
Ad

శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ని భారత్ క్లీన్ స్వీప్ చేసింది. మూడు మ్యాచ్ లలో విజయఢంక మోగించింది. ఇక మూడో వన్డేలో అయితే విరాట్ కోహ్లీ వీరవిహారమే చేసారు. ఫోర్లు, సిక్సర్లతో అభిమానులకు పూనకాలు తెప్పించాడు. కేవలం 110 బంతుల్లో 166 పరుగులు చేసాడు. అతని ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు, 13 ఫోర్లున్నాయి. 

Advertisement

అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో కోహ్లీకి ఇది 74వ సెంచరీ.. వన్డేలలో 46వది. ఈ సిరీస్ లో రెండో సెంచరీ సాధించగా.. గత 4వ వన్డేలలో మూడో సెంచరీ కావడం మరో విశేషం. ఇక ఈ మ్యాచ్ ద్వారా స్వదేశంలో అత్యదిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరు మీద ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. మరో విశేషం ఏంటంటే ఈ మ్యాచ్ లో టీమిండియా 317 పరుగుల తేడాతో రికార్డు నమోదు చేసింది. ఈ సిరీస్ లో రెండు సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరిస్ పురస్కారాలు అందుకున్నాడు. తిరువనంతపురం మ్యాచ్ లో మరో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక అభిమాని విరాట్ కోహ్లీ వద్దకు వచ్చాడు. ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ వద్దకు వచ్చి కాళ్లు మొక్కుతూ కేకలు వేశాడు. కోహ్లీ కూడా అతడిని పైకి లేపి హత్తుకున్నాడు. ఇక్కడ సూర్య కుమార్ యాదవ్ ఇక అంతరి మనసులను గెలుచుకున్నాడు. 

Advertisement

Also Read :  సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం ఏంటో తెలుసా..? 

Manam News

స్మార్ట్ ఫోన్ తీసుకొని స్వయంగా కోహ్లీ అభిమాని ఫోటోలను తీశాడు. అభిమానుల హర్షద్వానాలు, కేరింతలతో స్టేడియాన్ని ఒక్కసారిగా హోరెత్తించారు.  ఇప్పుడు ఘటనే తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ అభిమాని భద్రతను ఉల్లంఘించి మరీ మైదానంలోకి రావడం, ఆటగాళ్ల దగ్గరికీ రావడం స్టేడియంలోని భద్రతా వైఫల్యాన్ని సూచిస్తుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డా భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీలంకతో సిరీస్ ముగిసిన తరువాత న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోనున్నది. వన్డేలు, టీ 20 సిరీస్ లు ఆడనున్నది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ బుధవారం హైదరాబాద్ లో జరుగనుంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగబోయే ఈ మ్యాచ్ కోసం కివిస్, భారత్ జట్లు హైదరాబాద్ కు చేరుకున్నాయి.  కివీస్ జట్టు జనవరి 15నే భాగ్యనగరానికి చేరుకోగా.. టీమిండియా ఇవాళ హైదరాబాద్ కి చేరుకుంది. 

Also Read :  IND VS SL : కోహ్లీ కొట్టిన షాట్‌కు ఇద్దరు లంక ప్లేయర్లకు గాయాలు

Visitors Are Also Reading