టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలు పెట్టి లవర్ బాయ్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరో తరుణ్. ప్రేమకావాలి సినిమాతో తరుణ్ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగారు. ఎంత త్వరగా ఎదిగాడో తరుణ్ డౌన్ ఫాల్ కూడా అంతే త్వరగా జరిగింది. ఇదిలా ఉండగా తరుణ్ 2000 సంవత్సరంలో మహేశ్ బాబు, నాగార్జునలకు పోటీగా సినిమాను విడుదల చేసి హిట్ కొట్టాడు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2000 సంవత్సరంలో ఐదు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి.
Advertisement
అవే ఆజాద్, వంశీ, జయంమనదేరా, అమ్మో ఒకటో తారీకు మరియు నువ్వేకావాలి..ఆజాద్ సినిమాలో నాగార్జున సౌందర్య కలిసి నటించారు. ఈ సినిమా హిట్ అయ్యింది. ఇక వంశీ సినిమాలో మహేశ్ బాబు నమ్రత జంటగా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నమేర విజయం సాధించలేకపోయింది. ఇక జయం మనదేరా సినిమా విడుదల తరవాత వంశీ సినిమాకు ఉన్న క్రేజ్ కూడా తగ్గిపోయింది.
Also Read: లక్ష్మి పార్వతి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ? ఎన్టీఆర్ కి ఎలా దగ్గరయ్యారు ..!
Advertisement
జయం మనదేరా సినిమా 33 థియేటర్లలో ఏకంగా వంద రోజులు ఆడి రికార్డులు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే తరుణ్ రీచా హీరోహీరోయిన్ లు గా ప్రేక్షకుల మందుకు వచ్చిన సినిమా నువ్వేకావాలి. ఈ సినిమాకు మాటల మాత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. అంతే కాకుండా రామోజీరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఏకంగా 175 రోజులు ఆడి తరుణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఒక కోటి ఇరవైఐదు లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 10 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. అంతే కాకుండా ఈ సినిమాకు సూవర్ హిట్ టాక్ రావడం యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కడంతో మహేశ్ బాబు వంశీ సినిమాకు, నాగార్జున ఆజాద్ సినిమాకు కూడా గట్టి దెబ్బ పడింది.
Also Read: NTR: స్వర్గీయ ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన 10 అద్భుతమైన పథకాలు ఏవో తెలుసా ?