Home » విడాకులు తీసుకోబోతున్న పెళ్లి చూపులు సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్., అసలేమైందంటే ?

విడాకులు తీసుకోబోతున్న పెళ్లి చూపులు సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్., అసలేమైందంటే ?

by AJAY
Ad

చిత్ర పరిశ్రమలో వరుస విడాకుల వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరుగా సెలబ్రిటీ జంటలు విడిపోతూ ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి. ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఎంత కోరుకున్నా కలిసి ఉండటానికి ఇష్టపడటం లేదు. ముందుగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తన భార్య తో విడిపోతున్నట్టు ప్రకటించాడు. ఆ తరవాత నాగ చైతన్య సమంత విడిపోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. వీరి విడాకులు ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉన్నాయి.

Tharun bhascker latha

Tharun bhascker latha

ఇదిలా ఉండగానే రీసెంట్ గా ధనుష్ ఐశ్వర్య తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పారు. ఎలాంటి వార్తలు లేకుండానే సడెన్ గా తాము విడాకులు తీసుకుంటున్నట్టు ధనుష్ ఐశ్వర్య ప్రకటించారు. అయితే వీరిద్దరూ మళ్లీ కలుస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ధనుష్ తండ్రి కూడా అదే చెపుతున్నాడు. ఇప్పుడు మరో వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Advertisement

Tharun bhascker latha

పెళ్లి చూపులు తో ఇండస్ట్రీ ని తనవైపు తిప్పుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ తన భార్య లత తో విడిపోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. లత ప్రస్తుతం తరుణ్ భాస్కర్ ఇంటి నుండి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. త్వరలోనే వీళ్ళు విడాకులను అధికారికంగా ప్రకటిస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

వీరిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లత డిజైనర్ కాగా తరుణ్ భాస్కర్ ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అనేక ఇంటర్వ్యూ లలో తన భార్య లత గురించి ఎంతో గొప్పగా చెప్పేవాడు తరుణ్ భాస్కర్. మరి ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది అన్నది తెలియాలంటే ఎవరో ఒకరు విప్పాల్సిందే.

Also Read: బాలీవుడ్ లో బాల‌య్య క్రేజ్…అఖండ కోసం పోటీప‌డుతున్న హీరోలు..!

Visitors Are Also Reading