Home » తార‌క‌ర‌త్న హీరోయిన్ ఆ మాజీ సీఎం రెండో భార్య అన్న సంగ‌తి తెలుసా…ఎవ‌రంటే…!

తార‌క‌ర‌త్న హీరోయిన్ ఆ మాజీ సీఎం రెండో భార్య అన్న సంగ‌తి తెలుసా…ఎవ‌రంటే…!

by AJAY
Ad

సినిమాల్లో సక్సెస్ అయిన వాళ్ళు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆ తర్వాత రాజకీయాల్లో రాణించడం సహజమే. అంతేకాకుండా సినిమా వాళ్లను సినిమా వాళ్ల‌ను సినిమావాళ్లు వివాహం చేసుకోవడం కూడా చూస్తూనే ఉంటాం. కానీ రాజకీయ నేతలు సినీ తార‌ల‌ను వివాహం చేసుకున్న సందర్భాలు త‌క్కువ‌గా ఉంటాయి. అయితే ఆ లిస్ట్ లో ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది. ఆ హీరోయిన్ ఎవ‌రు ఇంత‌కీ ఏ రాజ‌కీయ‌నాకుడిని వివాహం చేసుకుంది అనే వివ‌రాలు చూద్దాం….ఆ హీరోయిన్ మరెవరో కాదు.

ALSO READ :TOLLYWOOD : ఈ వారం ఓటిటి, థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న భారీ చిత్రాలు…సినీల‌వ‌ర్స్ కు పండ‌గే!

Advertisement

నందమూరి తారకరత్న హీరోగా భద్రాద్రి రాముడు సినిమాలో నటించిన హీరోయిన్ రాధిక. ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించకపోయినా హీరోయిన్ రాధిక న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఈ చిత్రం తర్వాత రాధిక కోడి రామకృష్ణ దర్శకత్వంలో అవతారం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా అనుకున్న మేర విజయం సాధించలేకపోయింది. ఇక రాధిక కన్నడలోనూ పలు సినిమాల్లో నటించి అలరించింది.

Advertisement

అయితే రాధిక‌ కన్నడ సినిమాలు చేసిన సమయంలో డిస్ట్రిబ్యూటర్, నిర్మాత కుమార స్వామి గౌడ‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొంతకాలానికి ప్రేమగా మారింది. అయితే అప్పటికే కుమారస్వామి గౌడ‌కు వివాహం జరగ్గా ఆయ‌న‌కు కుమారుడు కూడా ఉన్నాడు. కానీ కుమారస్వామి త‌న మొద‌టి భార్య‌కు విడాకులు ఇచ్చి రెండో భార్య‌గా రాధిక ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు కూడా ఉంది.

ఇదిలా ఉంటే కుమారస్వామి గౌడ కేవలం సినిమాలలోనే కాకుండా తన తండ్రి దేవగౌడ రాజకీయవార‌సుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. దేవెగౌడ ప్రధానిగా ముఖ్యమంత్రి గా సేవలు అందించారు. ఇక కుమారస్వామి కూడా త‌న తండ్రి త‌ర‌వాత కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం వీగిపోవడంతో కుమారస్వామి సీఎం కుర్చీ నుంచి తప్పుకున్నారు.

Visitors Are Also Reading