Home » “థాంక్యూ టీజర్”: చైతన్య తన మాజీ భార్యను లక్ష్యంగా చేసుకున్నారా.. ఆ డైలాగ్ లో ఏముందో గమనించారా..?

“థాంక్యూ టీజర్”: చైతన్య తన మాజీ భార్యను లక్ష్యంగా చేసుకున్నారా.. ఆ డైలాగ్ లో ఏముందో గమనించారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో, హీరో నాగచైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ థాంక్యూ ఈ సినిమా టీజర్ బుధవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ క్లాస్ మరియు మాస్ వర్గాలను ఎంతో ఆకట్టుకునేలా డిఫరెంట్ లుక్ లో నాగచైతన్య కనిపిస్తూ ఉన్నారు. అందులోని విజువల్స్ షూట్ డైలాగ్స్ చూస్తే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మనం సినిమాతో నాగచైతన్య కెరీర్ లో ఘన విజయాన్ని అందించారు దర్శకుడు విక్రమ్ కె. ఆ సక్సెస్ తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల విరామం తీసుకొని మళ్లీ నాగచైతన్యతో థాంక్యూ చిత్రం చేశారు. డిఫరెంట్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ నిర్మిస్తున్నారు. అయితే ఇందులో” నా సక్సెస్ కు నేనే కారణం అంటూ నాగ చైతన్య ఎమోషనల్ గా చెప్పిన డైలాగ్” చాలా ఆసక్తికరంగా మారింది. “నీకు తప్ప నా లైఫ్లో ఇంకొకరికి చోటు లేదు అంటూ రాశి కన్నా కన్నీళ్లతో చెప్పే డైలాగ్ చెప్తుండగానే” చైతన్య హాకీ ప్లేయర్ గా సరికొత్త లుక్ లో కనిపించడం అభిమానులను ఒకింత ఆకట్టుకుంటోంది. అయితే ఈ డైలాగ్ ను చైతన్య ఫ్యాన్స్ పలు రకాలుగా ట్రోల్ చేస్తున్నారు.అయితే లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేది లేదు అంటూ అనే డైలాగ్ ప్రోమో లో ఉన్నది. ఎన్నో వదులుకొని ఇక్కడికి వచ్చాను. అయితే ఈ డైలాగ్ పై చైతన్య అభిమానులు మన వంతు వచ్చిందని డైలాగును విశ్లేషణ చేస్తూ ఇది సమంతకి గట్టి చంపదెబ్బ కొట్టినట్లు అని భావించారు. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి బి.వి.ఎస్.రవి కథను అందిస్తున్నారు. జూలై 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ ఒక యువకుడు జీవితంలోని భిన్న దశలను తెలియజేస్తూ సినిమా రూపొందుతోంది.

Advertisement

ALSO READ;

Advertisement

“ఆర్ఆర్ఆర్” లో జక్కన్న మిస్ అయిన లాజిక్ ను గమనించారా..? మీకూ అదే డౌట్ వచ్చిందా..!

త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య ఎవరో తెలుసా…? ఆమె ఏం చేస్తారంటే…!

 

Visitors Are Also Reading