Home » రాజకీయాల్లోకి రాకముందు మీ ఆస్తులెంత..ఇప్పుడెంత..? ఎమ్మెల్యే పై తమ్మారెడ్డి ఫైర్…!

రాజకీయాల్లోకి రాకముందు మీ ఆస్తులెంత..ఇప్పుడెంత..? ఎమ్మెల్యే పై తమ్మారెడ్డి ఫైర్…!

by AJAY
Ad

ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసందే. అయితే తాజాగా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫైర్ అయ్యారు. తమ్మారెడ్డి భరద్వాజ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. సినీ పరిశ్రమ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. సినిమా వాళ్లకు బలిసింది అని ఎలా మాట్లాడుతున్నారు అంటూ నిలదీశారు. ఎవరి మెప్పు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రశ్నించారు.

Thammareddy baradwaj

Thammareddy baradwaj

కుల ప్రస్తావన లేకుండా అందరికీ ఉపాధి కల్పిస్తున్న ఏకైక రంగం సినిమా రంగం అని తమ్మారెడ్డి వెల్లడించారు. సినిమాల విషయంలో కల మత ప్రస్తావన తీసుకురావద్దని అన్నారు. పుష్ప నిర్మాతలు ఫలానా కులానికి చెందిన వారు కాబట్టి ఇంకొక కులానికి చెందిన వారిని ఆ సినిమాలో తిట్టారని విమర్శలు చేయడం సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు. గతంలో కొందరు నేతలు ఇలా మాట్లాడిన విషయం తెలిసిందే…. వాళ్ళు గడ్డి తిన్నారని మీరు గడ్డి తింటారా అంటూ ప్రశ్నించారు. ప్రజలు ఆదరిస్తున్న అందరికీ అన్నం పెడుతున్న పరిశ్రమ సినిమా పరిశ్రమ అని హెచ్చరించారు.

Advertisement

Advertisement

Also read : మళ్లీ ఫోన్ విసిరేసిన బాలయ్య…వీడియో వైరల్…!

అంతేకాకుండా రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మీ ఆస్తులు ఎంత ఇప్పుడు మీ ఆస్తులు ఎంత….? దీనిపై చర్చించేందుకు దమ్మున్న నేతలు ఎవరైనా చర్చకు వస్తారా..? అంటూ తమ్మారెడ్డి సవాల్ విసిరారు. మీకు ఒక కులం వాళ్ళు ఓటేస్తేనే గెలవలేదని అన్ని వర్గాల వారు ఓట్లు వేస్తే గెలిచారని అన్నారు. ఇష్టం వచ్చినట్టు కులాల ప్రస్తావన తీసుకు వస్తూ సినిమావాళ్ల పై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. సినిమా వాళ్ళు అంత లోకువ అయ్యారా అంటూ తమ్మారెడ్డి నిలదీశారు. వందల మంది కష్టపడితే ఒక సినిమా వస్తుందని… ముందు కోట్లు ఖర్చు పెట్టి ఆ తర్వాత సినిమాను విడుదల చేసి రూపాయి.. రూపాయి జమచేసుకునే పరిస్థితి అని చెప్పుకొచ్చారు. కానీ కొందరు రాజకీయ నాయకుల పరిస్థితి వేరు అని అన్నారు. ఎన్నికలలో రూపాయి ఖర్చు పెట్టి దేశాన్ని దోచుకు తింటున్నారని అది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. విమర్శలు మానుకోవాలని లేదంటే తాము కూడా అదే పంథాలో వెళ్లాల్సి వస్తుందని తమ్మారెడ్డి హెచ్చరించారు.

Visitors Are Also Reading