టాలీవుడ్ లో తమ్మారెడ్డి భరద్వాజ అంటే పరిచయం అక్కర్లేని పేరు. నిర్మాతగా ఎన్నో విజయాలను అందుకున్న ఆయన పలు సేవా కార్యక్రమాలతోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఏ విషయం పై అయినా సూటిగా సుత్తిలేకుండా మాట్లాడుతూ ఆయన ఇంటర్వ్యూల ద్వారా కూడా మంచి విశ్లేషకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు హాట్ టాపిక్ లు గా మారిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి ఏపీలో టికెట్ల ధరల వివాదం అయితే మరొకటి సినిమా ఇండస్ట్రీకి పెద్దగా తాను వ్యవహరించను అని చిరంజీవి చేసిన కామెంట్లు. కాగా తాజాగా ఈ రెండు అంశాలపై తమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Advertisement
చిరంజీవి అశంపై ఆయన మాట్లాడుతూ…ఇండస్ట్రీకి పెద్దగా ఉండను అని చెప్పడానికి చిరంజీవి ఎవరు అని ప్రశ్నించారు. నేను ఆయనను దేవుడు అంటాను వద్దు అనడానికి ఆయన ఎవరని అన్నారు. చిరంజీవిని పెద్ద అని అనుకున్నానని ఆయన కాదు అంటే తాను ఎందుకు ఒప్పుకుంటానని అన్నారు. వయసు రిత్యా, కృష్ణ, కృష్ణం రాజు పెద్ద అయినా కాస్త వయసు ఎక్కువగా ఉండటం వల్ల ఇద్దరూ ప్రస్తుతం యాక్టివ్ గా ఉండలేకపోతున్నారని చిరంజీవి ఆ తరవాత స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయనే పెద్ద అని అన్నారు.
Advertisement
అంతే కాకుండా చిరంజీవి మోహన్ బాబు ఇద్దరు చెప్పింది కూడా సరైనదేనని అన్నారు. చిరు పంచాయితీలు చేయనని చెప్పారు కానీ అండగా ఉంటా అన్నారని..మోహన్ బాబు సినిమా సమస్యలపై అందరినీ కలుపుకుని వెళతానని అన్నారని కాబట్టి ఇద్దరూ మంచి పనే చేశారని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక ఏపీ టికెట్ ధరల విషయం పై మాట్లాడుతూ…తగ్గించిన రేట్లు రెండు మూడు సినిమాకు నష్టం కలిగిస్తాయని అదేవిధంగా తెలంగాణలో పెరిగిన ధరలు చిన్న సినిమాలకు ఇబ్బందిగా ఉంటాయని వ్యాఖ్యానించారు.