Telugu News » Blog » బాలకృష్ణ “భైరవద్వీపం” సినిమాకు పని చేసిన తమన్..జీతం ఎంతో తెలుసా..?

బాలకృష్ణ “భైరవద్వీపం” సినిమాకు పని చేసిన తమన్..జీతం ఎంతో తెలుసా..?

by AJAY
Published: Last Updated on
Ads

ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న సంగీత దర్శకుడు తమన్. ఓ స్టార్ హీరో సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది అంటే సంగీత దర్శకుడి పేరు దగ్గర తమన్ పేరే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్నో సినిమాలకు స్వరాలు అందించిన తమన్ “అల వైకుంఠపురంలో” సినిమా తో రికార్డులు బ్రేక్ చేశాడు. తన పాటలతో కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను సైతం తన వైపుకు తిప్పుకున్నాడు.

Advertisement

రీసెంట్ గా అఖండ సినిమాకు స్వరాలు సమకూర్చి తమన్ మరో హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాలో అందించిన మ్యూజిక్ కు మంచి మార్కులు పడ్డాయి. అయితే తాజాగా తమన్ ఆలీతో సరదాగా టాక్ షో లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తమన్ తన జీవితంలో ఎదురైన అనుభవాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనకు ఫ్లాప్ వస్తే ఎందుకు వచ్చిందని నేర్చుకుంటానని… అదే సక్సెస్ వచ్చినా ఆ సక్సెస్ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటానని తెలిపాడు. తను మొదటగా బాలకృష్ణ హీరోగా నటించిన “భైరవద్వీపం” సినిమా కు డ్రమ్మర్ గా పని చేసానని తెలిపాడు. అదే తన మొదటి సినిమా అంటూ వ్యాఖ్యానించారు.

Advertisement

Advertisement

అంతేకాకుండా అప్పట్లో తన జీతం రూ.30,000 అని తెలిపాడు. ఇప్పుడు అదే బాలకృష్ణ సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేశానని ఆనందం వ్యక్తం చేశాడు. అఖండ సినిమా మ్యూజిక్ చూసిన తర్వాత బాలయ్య అభినందించారని తెలిపారు. తాను ఈ స్థాయికి చేరుకునేందుకు 20 ఏళ్ల పైన సమయం పట్టిందని తమన్ తెలిపాడు. అప్పట్లో శంకర్ డైరెక్షన్ లో వచ్చిన బాయ్స్ సినిమాలో ఒక చిన్న రోల్ చేశానని… ఇప్పుడు రామ్ చరణ్ తో శంకర్ సినిమా తెరకెక్కిస్తున్న సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నా అని చాలా గర్వంగా ఉందని పేర్కొన్నాడు.