Home » రాక్ స్టార్ అని పిలవొద్దన్న తమన్…వీడియో వైరల్…!

రాక్ స్టార్ అని పిలవొద్దన్న తమన్…వీడియో వైరల్…!

by AJAY
Ad

ప్రస్తుతం తమన్ టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు. వరుస ఆఫర్ లతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. రీసెంట్ గా అఖండ సినిమా కు తమన్ ఇచ్చిన మ్యూజిక్ ప్రేక్షకులను ఫిదా చేసింది. సినిమాలో తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు క్లాప్స్ వినిపించాయి. ఇక్కడ చూసినా తమన్ మ్యూజిక్ కు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇక ప్రస్తుతం తమన్ మరికొన్ని సినిమా లకు కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు.

Advertisement

Advertisement

వాటిలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమా కూడా ఒకటి. కాగా రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ….చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తమన్ ఒక రాక్ స్టార్ అంటూ కామెంట్ చేశాడు. దాంతో వెంటనే తమన్ షాక్ అయ్యాడు. రాక్ స్టార్ అని పిలవద్దు అని కోరాడు. దాంతో మ్యూజిక్ ఇచ్చే వాళ్ళు అందరూ రాక్ స్టార్స్ అంటూ వరుణ్ చెప్పగా అయినా పిలవద్దు అంటూ తమన్ అడ్డుకున్నాడు.

దాంతో వరుణ్ తేజ్ తమన్ అని చెబుతూ మాట్లాడాడు. నిజానికి టాలీవుడ్ లో డీ ఎస్ పీ ని రాక్ స్టార్ అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే అందువల్లే తనను రాక్ స్టార్ అని పిలవద్దు అంటూ తమన్ చెప్పాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Visitors Are Also Reading