Home » ఆ కామెంట్ల‌తో హ‌ర్ట్ అయ్యిన త‌మ‌న్… వ‌ర‌స ట్వీట్ల‌తో నానికి కౌంటర్లు…?

ఆ కామెంట్ల‌తో హ‌ర్ట్ అయ్యిన త‌మ‌న్… వ‌ర‌స ట్వీట్ల‌తో నానికి కౌంటర్లు…?

by AJAY
Ad

ప్ర‌స్తుతం ఫుల్ స్వింగ్ మీద ఉన్న సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌ని అడిగితే ఒక్క క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా చెప్పే పేరు త‌మ‌న్. రీసెంట్ గా బాల‌య్య హీరోగా న‌టించిన అఖండ సినిమాతో త‌మ‌న్ మ‌రో హిట్ అందుకున్నాడు. త్వ‌ర‌లో షూటింగ్ కు సిద్దంగా ఉన్న శంక‌ర్ రామ్ చ‌ర‌ణ్ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఫిక్స్ అయ్యాడు. అంతే కాకుండా మ‌రో ప‌ది సినిమాలు ప్ర‌స్తుతం త‌మ‌న్ చేతిలో ఉన్నాయి.

nani thaman

nani thaman

అయితే ఇలా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న త‌మ‌న్ వ‌రుస ట్వీట్లు చేస్తూ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. నాని హీరోగా న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ సినిమా రీసెంట్ గా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా వేడుక‌లో నాని ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశాడు. త‌న సినిమాల్లో అన్ని క్రాఫ్టుల్లాగే మ్యూజిక్ కు కూడా స‌మాన‌మైన ప్రాధాన్య‌త ఉంటుంద‌న్నాడు. సంగీతం లేదంటే బీజీఎం సినిమాను డామినేట్ చేయ‌కూడ‌దు అంటూ కామెంట్లు చేశాడు.

Advertisement

Advertisement

also read : ఉత్త‌ చేతులతో వ‌చ్చి ఇండ‌స్ట్రీలో కోట్లు సంపాదించా..శ్రీవిష్ణు ఎమోష‌న‌ల్..!

అలా డామినేట్ చేస్తే శృతి త‌ప్పుతుంది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. అయితే తాజాగా ఈ కామెంట్ల‌పై త‌మ‌న్ హ‌ర్ట్ అయ్యి ఉంటాడ‌ని నెటిజ‌న్లు అనుకుంటున్నారు. దానికి కార‌ణం త‌మ‌న్ వ‌రుస ట్వీట్లు చేస్తూ అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డ‌మే. త‌మ‌న్ నానికి కౌంట‌ర్ గా త‌న ట్వీట్ల‌లో అన్ని క్రాఫ్ట్ లు స‌మానంగా క‌లిసి ప‌నిచేస్తేనే సినిమా విజ‌య వంతం అవుతుంద‌ని..ఏ ఒక్క క్రాఫ్ట్ దేనిని డామినేట్ చేయ‌దు అంటూ వ‌రుస ట్వీట్లు చేశాడు. ఇక తమ‌న్ చేసిన ట్వీట్లు నానిని ఉద్దేశించేన‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

Visitors Are Also Reading