Home » బాలీవుడ్ నుండి అందుకే వ‌చ్చేశా..త‌మ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

బాలీవుడ్ నుండి అందుకే వ‌చ్చేశా..త‌మ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

by AJAY
Ad

త‌మ‌న్ ప్ర‌స్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా రానిస్తున్నారు. ప‌దిసినిమాలు వ‌స్తే అందులో ఐదింటికి పైగా త‌మ‌న్ స్వరాలే వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ కల్యాణ్, మ‌హేశ్ బాబు, చ‌ర‌ణ్, తార‌క్ ఇలా అంద‌రు స్టార్ హీరోల సినిమాల‌కూ త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. అల వైకుంఠ పురంలో సినిమాతో త‌మ‌న్ స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. ఈ సినిమా పాట‌ల‌కు బాలీవుడ్ సైతం ఫిదా అయ్యింది.

Advertisement

కొంత కాలం త‌మ‌న్ బాలీవుడ్ లోనూ సినిమాల‌కు మ్యూజిక్ అందించారు. కానీ తాజాగా త‌మ‌న్ బాలీవుడ్ పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ…బాలీవుడ్ లో ఒక్క సినిమాకు ఐదారుగురు మ్యూజిక్ డైరెక్ట‌ర్లు ప‌నిచేస్తార‌ని అన్నారు. అలా త‌న‌కు నచ్చ‌ద‌ని వ్యాఖ్యానించాడు. ఒక్క సినిమాకు అంత‌మంది సంగీత ద‌ర్శ‌కులు ఎలా ప‌నిచేస్తారంటూ త‌మ‌న్ ప్ర‌శ్నించారు. అక్క‌డే ఉంటే అందులో ఒకడిగా మారిపోతానేమోన‌ని అక్క‌డ నుండి వ‌చ్చేశాన‌ని చెప్పాడు.

Advertisement

బాలీవుడ్ లో తాను ఇమ‌డ‌లేక‌పోయాన‌ని త‌మ‌న్ బ‌య‌ట‌పెట్టారు. ఒక సినిమాకు ఒకే సంగీత ద‌ర్శ‌కుడు ఉండాల‌ని అప్పుడే బాగుంటుంద‌ని త‌మ‌న్ అన్నారు. పాట‌ల‌కు ఒక మ్యూజిక్ డైరెక్ట‌ర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు ఒక మ్యూజిక్ డైరెక్ట‌ర్ అంటే పెళ్లి ఒక‌రితో ఫ‌స్ట్ నైట్ మ‌రొక‌రితో అన్న‌ట్టు ఉంటుంది అంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు. ఇదిలా ఉంటే త‌మ‌న్ బాలీవుడ్ లో గోల్ మాల్, సూర్య‌వంశ్, సింబా సినిమాల‌కు స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ఇక ప్ర‌స్తుతం దాదాపు ప‌ది టాలీవుడ్ చిత్రాల‌కు మ్యూజిక్ ఇస్తున్నాడు.

Visitors Are Also Reading