Home » Test Rankings 2022 : టెస్ట్ ర్యాంకింగ్స్‌లో జ‌డేజా నెంబర్ వ‌న్

Test Rankings 2022 : టెస్ట్ ర్యాంకింగ్స్‌లో జ‌డేజా నెంబర్ వ‌న్

by Anji
Ad

ఐసీసీ తాజాగా విడుద‌ల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లోని ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో టీమిండియా ఆట‌గాడు ర‌వీంద్ర జ‌డేజా అగ్ర‌స్థానాన్ని కైవ‌సం చేసుకున్నాడు. శ్రీ‌లంక‌తో జ‌రిగిన భార‌త్ తొలిటెస్ట్ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో 175 ప‌రుగులు సాధించిన జ‌డేజా.. బ్యాటింగ్ జాబితాలో 17 స్థానాలు ఎగ‌బాకాడు. 54వ స్థానంలో ఉన్న అత‌ను 37వ స్థానానికి చేరుకున్నాడు. 9 వికెట్లు తీయ‌డం వ‌ల్ల బౌలింగ్‌లో కూడా 17వ స్థానంలో స్థిర‌ప‌డ్డాడు.

Jadeja

Jadeja

టెస్ట్‌ల‌లో జ‌డేజాకు ఇది అత్య‌ధిక స్కోరు. ఏడ‌వ స్థానంలో ఓ భార‌త బ్యాట్స్‌మెన్ సాధించిన అత్య‌ధిక ప‌రుగులు కూడా ఇవే. క‌పిల్ దేవ్ 1986 శ్రీ‌లంక‌పైనే 163 ప‌రుగుల‌తో నెల‌కొల్పిన రికార్డును అత‌ను క్రాస్ చేశాడు. ఇటీవ‌ల మొహ‌లీలో శ్రీ‌లంక‌తో జ‌రిగిన టెస్ట్‌లో భార‌త్ విజ‌యం సాధించిన త‌రువాత ర‌వీంద్ర జ‌డేజా ఐసీసీ పురుషుల టెస్ట్ ప్లేయ‌ర్ ర్యాంకింగ్స్‌ల‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకున్నాడని ఐసీసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Advertisement

Advertisement

Ravindra Jadeja

Ravindra Jadeja

మొహాలీ ప్రదర్శనతో రవీంద్ర జడేజా తన అగ్రస్థానాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. 2021 ఫిబ్రవరి నుంచి విండీస్​ ఆల్​రౌండర్​ జేసన్​ హోల్డర్​ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అంతకుముందు జడేజా 2017 ఆగస్టులో వారం రోజుల పాటు అగ్రస్థానంలో ఉన్నాడు. ఆల్​రౌండర్​ల జాబితాలో రవిచంద్రన్​ అశ్విన్​ ఒక స్థానాన్ని కోల్పోయాడు. మరో ఆల్​రౌండర్​ అక్షర్​ పటేల్​ రెండు స్థానాలు కోల్పోయి 14 స్థానంలో ఉన్నాడు. గాయం కారణంగా అక్షర్​ మొహాలీ టెస్ట్​లో ఆడలేదు.

Also Read :  18 బంతుల్లో 9 ప‌రుగులు చేయ‌లేక‌పోయిన ఇంగ్లాండ్..!

Visitors Are Also Reading