తెలంగాణలో ప్రతి సంవత్సరం పదో తరగతి పరీక్షలపై అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కరోనా మహమ్మారి కారణంగా 2019- 2020, 2020-2021 విద్యాసంవత్సరానికి చెందిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. 2021-2022లో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది కూడా ఇప్పటికే చైనాలో బీఎఫ్-7 విజృంభిస్తుండడంతో కరోనా లాగే అది భారత్ లోకి ప్రవేశిస్తే.. మళ్లీ పరీక్షలు ఉండవనే అనుమానాలు కూడా కొందరూ పేర్కొంటుండగానే.. ఇంతలోనే పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.
Advertisement
ఏప్రిల్ 03 నుంచి 10వతరగతి పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తొమ్మిది, పదోతరగతి విధానంలోనే రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణలు తీసుకొచ్చిన విషయం విధితమే. ఇక నుంచి తొమ్మిది, పదో తరగతులకు సంబంధించి 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Advertisement
Also Read : యాంకరింగ్ కి గుడ్ బై.. క్లారిటీ ఇచ్చిన సుమ..!
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఈ సంస్కరణలు అమలవుతాయని పేర్కొంది. ఒక్కో సబ్జెక్ట్ లో పరీక్షలకు సంబంధించి 80, ఫార్మెటివ్ అసెస్మెంట్ కి 20 మార్కుల చొప్పున కేటాయించనున్నట్టు తెలిపింది. సైన్స్ పేపర్ లో ఫిజికల్ సైన్స్, బయాలజీకి చెరి సగం మార్కులు ఉంటాయని వివరించింది. ఒక్క సైన్స్ పరీక్షకు మాత్రం 3.20 గంటల సమయం కేటాయించింది. మిగతా అన్ని సబ్జెక్ట్ లకు 3 గంటలు మాత్రమే ఉంటుందని.. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఎలాగో టైమ్ టేబుల్ వచ్చింది కాబట్టి ఇక నుంచి పదోతరగతి విద్యార్థులు పరీక్షల కోసం సిద్ధమై మంచి మార్కులు సాధించండి.
Advertisement
Also Read : TSPSC : తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగుస్తోంది !