Home » పాపుల‌ర్ న‌వ‌ల‌ల ఆధారంగా తెర‌కెక్కిన‌ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన 6 సినిమాలు…!

పాపుల‌ర్ న‌వ‌ల‌ల ఆధారంగా తెర‌కెక్కిన‌ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన 6 సినిమాలు…!

by AJAY
Ad

ద‌ర్శ‌కులు తమ సినిమా క‌థ‌ల‌ను వివిధ రకాలుగా ఎంపిక చేసుకుంటారు. కొన్ని సినిమా క‌థ‌ల‌ను త‌మ నిజ‌జీవితాల‌లో చూసిన సంఘ‌ట‌న‌ల ఆధారంగా తీసుకుంటే….మ‌రికొన్ని క‌థ‌ల‌ను ఊహించి రాసుకుంటారు. అదే విధంగా ఇత‌ర భాష‌ల్లో సూప‌ర్ హిట్ గా నిలిచిన సినిమాల‌ను రీమేక్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు న‌వ‌ల‌ల ఆధారంగా సినిమాలు పెద్ద‌గా రావ‌డం లేదు. కానీ ఒక‌ప్పుడు ఎక్కువ‌గా న‌వ‌ల‌లు ఫేమ‌స్ పుస్తకాల ఆధారంగానే సినిమాలు ఎక్కువ‌గా వ‌చ్చేవి. అలా న‌వ‌ల‌ల ఆధారంగా పుస్త‌కాల ఆధారంగా తెర‌కెక్కిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…

Advertisement

చిరంజీవి హీరోగా 1983లో తెర‌కెక్కిన అభిలాష సినిమా యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ రాసిన న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కింది. అభిలాష అనే న‌వ‌ల ఆధారంగానే అభిలాష సినిమాను తెర‌కెక్కించ‌గా ఈ చిత్రానికి కోదండిరామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

చిరంజీవి హీరోగా న‌టించిన చంట‌బ్బాయ్ సినిమాను కూడా న‌వ‌ల ఆధారంగానే తెర‌కెక్కించారు. 1986లో జంధ్యాల ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హించారు.

Advertisement

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు హీరోగా 1971లో ప్రేమ్ న‌గ‌ర్ అనే సినిమా వ‌చ్చింది. ఈ సినిమాను కోడూరి కౌస‌ల్య‌దేవి రాసిన న‌వ‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు కేఎస్ ప్ర‌కాష్ రావు తెర‌కెక్కించారు.

ఆహ నా పెళ్లంట సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కోట‌శ్రీనివాసరావు కీల‌క పాత్ర‌లో న‌టించ‌గా రాజేంద్ర‌ప్ర‌సాద్ హీరోగా న‌టించాడు. ఈ చిత్రానికి జంద్యాల దర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఈ సినిమాను ఆది విష్ణు ర‌చించిన స‌త్యంగారిల్లు అనే న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కించారు.

ఎన్టీఆర్ సావిత్రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన క‌న్యాశూల్కం సినిమాను గుర‌జాడ అప్పారావు రాసిన క‌న్యాశూల్కం అనే సినిమా ఆధారంగా తెర‌కెక్కించారు.

సుమ‌న్ హీరోగా న‌టించిన సితార సినిమాను మ‌హ‌ల్లో కోకిల అనే న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కించారు. ఈ సినిమాకు వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Visitors Are Also Reading