అందమైన హీరోయిన్స్ ను విలన్స్ గా చూపించి తమ సినిమాను మరింత ప్రభావ పూరితంగా చూపించారు దర్శకులు. కథకు తగ్గట్టుగా లేడీ విలన్స్ అవసరమున్న దగ్గర హీరోయిన్స్ నే ఆ పాత్రలో చేయించి వావ్ అనిపించారు! నటనకు స్కోప్ ఉండడంతో హీరోయిన్స్ కూడా ఒకే అని చేసిన కొన్ని పాత్రలను ఇప్పుడు చూద్దాం!
నరసింహ సినిమాలో రమ్యకృష్ణ:
Advertisement
నరసింహా సినిమాలో నీలాంబరిగా సూపర్ స్టార్ రజనికాంత్ తో పోటాపోటిగా నటించి అందరిని మెప్పించింది రమ్యకృష్ణ. ఈ సినిమాలో సౌందర్య ముఖాన్ని కాలితో లేపే సీన్ హైలెట్!
పొగరు సినిమాలో శ్రేయారెడ్డి :
“నేను మీసం లేని మగరాయున్ని రా” అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో పొగరు సినిమాలో ఆకట్టుకుంది శ్రేయారెడ్డి. పొగరు సినిమా హీరో అయిన విశాల్ అన్నను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.
Rx100 సినిమాలో పాయల్ రాజ్ పుత్ :
మొదటి సినిమానే నెగెటివ్ రోల్ లో నటించి వావ్ అనిపించింది పాయల్ రాజ్ పుత్. నిజంగానే తన నటనతో ప్రతి లవర్ ఫీల్ అయ్యేలా చేసింది
Advertisement
చిత్రం సినిమాలో రాశి :
ఫ్యామిలీ హీరోయిన్ గా వెలుగొందిన రాశి … చిత్రం సినిమాలో గోపిచంద్ సరసన విలన్ రోల్ చేసింది.
ధర్మయోగి సినిమాలో త్రిష :
పదవి కోసం ఎంతకైనా తెగించే పాత్రలో త్రిష ధర్మయోగి సినిమాలో మెప్పించింది.
“నా మనసిస్తా రా” సినిమాలో సౌందర్య :
సౌందర్య ఈ సినిమాలో నెగెటివ్ రోల్ లో అదరగొట్టినా… జనాలు మాత్రం అమెను నెగెటివ్ పాత్రలో చూడలేకపోయారు. దాని పర్యావసానం ఈ సినిమా ప్లాప్!
టెన్ సినిమాలో సమంతా
క్యూట్ బ్యూటి సమంతా…. విక్రమ్ ‘టెన్’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.
గూఢచారి 117 సినిమాలో భానుప్రియ :
భానుప్రియ గూఢచారి 117 సినిమాలో నెగటివ్ రోల్ లో నటించింది. ఆడియన్స్ భానుప్రియను కూడా నెగెటివ్ రోల్ లో యాక్సెప్ట్ చేయలేదు.
Also Read:1980లో NTR, ANR, కృష్ణ, శోభన్ బాబుల రెమ్యునరేషన్స్ ఎంతంటే?