Home » సొంత విమానాలు ఉన్న తెలుగు హీరోలు..అన్ని కోట్లు పెట్టి కొన్నారా..?

సొంత విమానాలు ఉన్న తెలుగు హీరోలు..అన్ని కోట్లు పెట్టి కొన్నారా..?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు, ఇతరాత్రా నటీనటులు ఎలాంటి లగ్జరీ జీవితాన్ని గడుపుతారో మనందరికీ తెలుసు. వారు తినే తిండి నుంచి వేసుకునే చెప్పుల వరకు, నడిపే బైకు నుంచి గాల్లో ఎగిరే విమానాలు వరకు అన్ని లగ్జరీ గానే ఉంటాయి. ఇక వారి కార్ల విషయానికి వస్తే మార్కెట్లోకి కొత్త కార్ రావడమే ఆలస్యం ఆ కారు ఆ స్టార్ ల ఇంటి ముందు ఉంటుంది. అలాంటి మన తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా మంది స్టార్ హీరోలకు కొన్ని ప్రత్యేకమైన ప్రైవేట్ జెట్ విమానాలు ఉన్నాయట.. మరి ఎవరెవరికి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

చిరంజీవి:

ALSO READ:“ప్రేమ కథ చిత్రం” హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

చిరంజీవి ఫ్యామిలీకి ఒక ప్రైవేట్ విమానం ఉందట. దీన్ని ఎక్కువగా రామ్ చరణ్ వాడుతారని వెకేషన్స్ కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తారని తెలుస్తోంది.. తాజాగా నిహారిక పెళ్లి కి ఉదయపూర్ కి జెట్ లోనే వెళ్లారని తెలుస్తోంది.
అల్లు అర్జున్ :

అల్లు అర్జున్ కుటుంబానికి కూడా ఒక ప్రైవేట్ జెట్ ఉందని తెలుస్తోంది.. వీరు చాలా సందర్భాల్లో ఆ జెట్ ముందు ఫోటోలు కూడా దిగారట.
అక్కినేని నాగార్జున:


అక్కినేని వారి ఫ్యామిలీ కి కూడా ఒక ప్రత్యేకమైన విమానం ఉంది. ఇందులో నాగార్జున నాగచైతన్య అఖిల్ కలిసి కొన్ని సందర్భాల్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రభాస్:


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒక ప్రత్యేక విమానం ఉందని తెలుస్తోంది. ఇది బాహుబలి మూవీ తర్వాత కొనుగోలు చేసినట్టు సమాచారం.
మహేష్ బాబు :


అలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు కూడా ఒక ప్రైవేట్ జెట్ ఉందని తెలుస్తోంది. దీన్ని వారు ఏదైనా విహారయాత్రలకు వెళ్ళినప్పుడు తీసుకెళ్తారు.
ఎన్టీఆర్:

అంతేకాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కూడా ఒక ప్రైవేటు జెట్ విమానం ఉందని దాని విలువ 80 కోట్లకు పైగానే ఉందని సమాచారం.
విజయ్ దేవరకొండ :

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఒక విమానాన్ని కొనుగోలు చేశారట. ఈ జెట్ లో వారు ప్రయాణిస్తున్న సమయంలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ALSO READ;“దానవీరశూరకర్ణ” మూవీ ఇంతటి రికార్డు సాధించిందా.!!

Visitors Are Also Reading