Home » న్యూజిలాండ్ ఎంపీగా తొలి తెలుగు అమ్మాయి

న్యూజిలాండ్ ఎంపీగా తొలి తెలుగు అమ్మాయి

by Anji

ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల్లో భార‌త సంత‌తికి చెందిన వారు ప‌లువురు ఉన్న‌త ప‌దవులు అధిరోహిస్తూ దేశ‌ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేస్తూ ఉన్నారు. ఈ కోవ‌లోకే ప్ర‌కాశం జిల్లా టంగుటూరుకు చెందిన గ‌డ్డం మేఘ‌న‌(18) చేరి రికార్డు సృష్టించారు. న్యూజిలాండ్ దేశ యూత్ పార్ల‌మెంట్ స‌భ్యురాలుగా ఎంపికై అరుదైన గౌర‌వం ద‌క్కించుకుంది.

న్యూజిలాండ్ దేశ నామినేటేడ్ ఎంపీ ప‌ద‌వుల ఎంపిక నేప‌థ్యంలో సేవా కార్య‌క్ర‌మాలు, యువ‌త విభాగానికి ప్రాతినిధ్యం వ‌హించే పార్ల‌మెంట్ స‌భ్యురాలిగా వాల్క‌టో ప్రాంతం నుండి ఎంపిక‌య్యారు.  మేఘ‌న తండ్రి గడ్డం రవి కుమార్ ఉద్యోగం రీత్యా 2001లో భార్య ఉష తో కలిసి న్యూజిలాండ్ లోనే స్థిరపడ్డారు. మేఘన అక్కడే పుట్టి పెరిగిన‌ది. అయితే కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ ఉన్నత పాఠశాలలో స్కూలింగ్ పూర్తిచేసారు. చిన్న నాటి నుంచి పలు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే ఆమె హెడ్‌గ‌ర్ల్ గా ఉండి విద్యార్థుల సమస్యలను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేవారు కూడా. నియోజకవర్గాల వారీగా అందించే ‘ఆల్‌ ట్రూజా’ అవార్డును సైతం మేఘన అందుకున్నారు. సెయింట్ పీటర్స్ స్కూల్ చరిత్ర లో తొలిసారిగా భారత్ కు చెందిన మేఘన ఉత్తమ విద్యార్థినిగా పాఠశాల గుర్తించింది.

న్యూజిలాండ్ కు వలస వచ్చిన పలు దేశాల శరణార్థులకు కనీస వసతులు, విద్య ఆశ్రయం కల్పించడం లో మేఘనా కీలక పాత్ర పోషించారు.  తోటి స్నేహితులతో కలిసి విరాళాలు సేకరించి ఇచ్చారు.  ఆమె చేపట్టిన సేవా కార్యక్రమాలను గుర్తించి న్యూజిలాండ్ ప్రభుత్వం సేవా కార్యక్రమాలు యువత విభాగానికి బేగం వాల్క‌ట్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక చేసింది. 2021 డిసెంబర్ 16 మన జరిగిన ఈ ఎంపిక ఆ ప్రాంత ప్రభుత్వం ఎంపీ టిమ్‌ నాన్‌ డిమోలెన్‌.. మేఘనా కుటుంబ సభ్యులకు వివరించారు. ఆ తర్వాత ఫిబ్రవరి లో ఆమె ప్రమాణ స్వీకారం సంక్రాంతికి తన స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని వెల్లడించారు. న్యూజిలాండ్ దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై గలమెత్తుతాన‌ని మేఘన పేర్కొన్నారు. ఆ దేశానికి వచ్చిన శరణార్ధులను ఆదుకుని అక్కున చేర్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నిస్తానని మేఘన చెప్పారు.

Visitors Are Also Reading