Telugu News » టాలీవుడ్ నుండి గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన 6 గురు!

టాలీవుడ్ నుండి గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన 6 గురు!

by Azhar

టాలీవుడ్ నుండి 6 గురు లెజెండ్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్ లో త‌మ పేరు లిఖించుకున్నారు. అధిక సినిమాల్లో న‌టించి ఒక‌రు, అధిక సినిమాల్లో పాడి ఒక‌రు. అధిక సినిమాలు ప్రొడ్యూజ్ చేసి మ‌రొక‌రు ఇలా మొత్తంగా 6 గురు లెజెండ్స్ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. వారెవ‌రో ఇప్పుడు చూద్దాం!

Ads

సుశీల :
గానకోకిల సుశీల 17695 పాట‌లు పాడి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంతో క‌లిసి దాదాపు 1336 డ్యుయెట్స్ పాడారు సుశీల.

Also Read:  భువ‌నేశ్వ‌ర్ క్యాచ్ వ‌దిలేయ‌డంతో.. కెప్టెన్ రోహిత్ కోపంతో బంతిని ఎలా త‌న్నాడో చూడండి

 

బ్ర‌హ్మానందం :
1000 కి పైచిలుకు మావీస్ లో నటించినందుకు 2010లో బ్ర‌హ్మానందంకు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చోటు ద‌క్కింది .


రామానాయుడు :
13 లాంగ్వేజెస్ లో 150 కి పైగా మూవీస్ ను ప్రొడ్యూజ్ చేసినందుకు 2008లో ఈయ‌నకు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చోటు ద‌క్కింది.

గ‌జ‌ల్ శ్రీనివాస్ :
2008లోనే గ‌జ‌ల్ గాయ‌కుడు గ‌జ‌ల్ శ్రీనివాస్ కూడా గిన్నిస్ బుక్ లో చోటు ద‌క్కించుకున్నాడు. 100 భాష‌ల్లో 100 పాట‌లు పాడినందుకు గాను గ‌జ‌ల్ కు ఈ గౌర‌వం ద‌క్కింది.

బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం:
2001లో బాలు గిన్నిస్ బుక్ లో చోటు ద‌క్కించుకున్నారు. 36వేల పాట‌లు పాడినందుకు కు ఈ గౌర‌వం ద‌క్కింది.

Also Read: పవన్ కల్యాణ్ కు సపోర్ట్ గా మహేష్ బాబు, కేటీఆర్…!

విజ‌యనిర్మ‌ల‌:
2000 సంవ‌త్స‌రంలో విజ‌య నిర్మ‌ల గిన్నిస్ బుక్ లో చోటు ద‌క్కించుకున్నారు. తెలుగు, త‌మిళ్ , క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం భాష‌ల్లో…. 42 సినిమాలు డైరెక్ట్ చేసిన మ‌హిళ‌గా ఈ గౌర‌వం ద‌క్కింది


You may also like