Home » సమంతను నమ్ముకుంటే ఇలా జరిగిందేంటి…తెలుగు రాష్ట్రాల్లో ఒక్క టికెట్ కూడా…!

సమంతను నమ్ముకుంటే ఇలా జరిగిందేంటి…తెలుగు రాష్ట్రాల్లో ఒక్క టికెట్ కూడా…!

by AJAY
Ad

అందాల తార సమంతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సమంతకు కూడా ఒక చిన్న పాటి హీరోకు ఉన్నంత అభిమానులు ఉన్నారు. సమంత సినిమా వచ్చిందంటే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా మాత్రం అలా జరగలేదు. అంతే కాకుండా సమంతకు ఊహించని షాక్ తగిలింది. సమంత నయనతార హీరోయిన్ లు గా విజయ్ సేతుపతి హీరోగా నటించిన సినిమా కాతు వాకుల రెండు కాదల్….ఈ సినిమాను సమంత పుట్టినరోజు సందర్భంగా గురువారం విడుదల చేశారు.

Advertisement

ఈ చిత్రానికి నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఒకే వ్యక్తికి ఇద్దరు ప్రియురాల్లు ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి అన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమా నేరుగా తమిళంలో తెరకెక్కగా తెలుగుతోపాటు మలయాళంలోనూ డబ్ చేశారు. తెలుగులో ఈ సినిమాను కల్మని రాంబో కతిజా పేరుతో విడుదల చేశారు. అయితే తెలుగులో క్రేజ్ ఉందని విడుదల చేశారు కానీ ఈ సినిమా ఓపెనింగ్స్ చూస్తే దారుణంగా ఉన్నాయి.

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 80 శాతం మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు ఒక టికెట్ కూడా బుకింగ్ అవ్వలేదు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రేక్షకులు రాకపోవడంతో ఈ సినిమాను నిలిపి వేశారు. తమిళ్ లో కూడా ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేకపోయింది.

అయితే తెలుగులో మాత్రం సమంత క్రేజ్ ను నమ్ముకునే ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కానీ ఇలాంటి రెస్పాన్స్ రావడంతో మేకర్స్ కూడా షాక్ అవుతున్నారు. మరోవైపు సమంత నాగచైతన్య విడాకుల తరవాత వచ్చిన మొదటి సినిమా ఇదే. ఇక ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమాలో నటించింది. శాకుంతలం లేడీ ఓరియెంటెడ్ సినిమా మరి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Also read :

రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వచ్చినా వదులుకున్న కార్తీకదీపం నటి..!

రియ‌ల్ లైఫ్ తండ్రీకొడుకులు రీల్ లైఫ్ లో క‌లిసి న‌టించిన ఈ 10 సినిమాలు అట్ట‌ర్ ఫ్లాప్..!

Visitors Are Also Reading