Home » తెలంగాణలో మరో భారీ నోటిఫికేషన్..లైబ్రేరియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..ఇలా అప్లై చేయండి

తెలంగాణలో మరో భారీ నోటిఫికేషన్..లైబ్రేరియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..ఇలా అప్లై చేయండి

by Bunty
Ad

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులపై దృష్టి సారించింది. నిరుద్యోగుల ఓట్లను రాబట్టేందుకు… వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే పోలీస్ శాఖలో దాదాపు 16 వేల పోస్టులను భర్తీ చేయనున్న ప్రభుత్వం… ఇటు గ్రూప్ 4, గ్రూప్ 2, అలాగే రెవెన్యూ అటు వైద్యశాఖలో ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్యలో 71 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Advertisement

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైబ్రరీ సైన్స్ డిగ్రీలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లైబ్రరీ సైన్స్/ఇన్ఫర్మేషన్ సైన్స్/డాక్యుమెంటేషన్ సైన్స్ స్పెషలైజేషన్ లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే యుజిసి నెట్/స్లేట్/సెట్ లో అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

Advertisement

ఈ అర్హతలున్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 10, 2023వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 21 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రూ. 320లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 2023 మే/జూన్ నెలలో నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి ఈ నెలకు ఏవో పోస్టులకు రూ. 54,220 నుంచి రూ.1,33,630ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

read also : BCCI సంచలన నిర్ణయం..IPL విదేశీ ప్లేయర్లకు ఎదురుదెబ్బ !

Visitors Are Also Reading