Home » తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష తేదీలు ఖరారు..ఎప్పుడంటే..?

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష తేదీలు ఖరారు..ఎప్పుడంటే..?

by Anji
Ad

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం వరుసగా నోటిఫికేషన్లు వేసిన విషయం తెలిసిందే. తొలుత గ్రూపు 1, ఆ తరువాత గ్రూపు 4, గ్రూపు 2, గ్రూపు 3 నోటిఫికేషన్లను జారీ చేశారు. అంతకు ముందు ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్లను విడుదల చేసిన తెలిసిందే. అల్రెడీ గ్రూపు1 ఫిలిమ్స్, ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ కూడా జరిగిన విషయం తెలిసిందే. ఇటీవలే గ్రూపు 4 కి సంబంధించి పరీక్ష తేదీలను కూడా ప్రకటించారు. తాజాగా గ్రూపు 2కి సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించారు. 

Advertisement

గ్రూపు 2 కి పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఖరారు చేసింది. ఆగస్టు 29, 30 తేదీలలో గ్రూపు 2 పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 783 గ్రూపు 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన విషయం విధితమే. జూన్ 05 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు, జులై 1న గ్రూప్ 4 పరీక్షలు జరుగనున్నాయి. 

Advertisement

Telangana: No minimum qualifying marks for getting shortlisted for group -1

రాష్ట్రంలో గ్రూపు2 ఉద్యోగాలకు సంబంధించి 783 పోస్టులకు గాను 5,51,943 దరఖాస్తులు వచ్చినట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. జనవరి 18 నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించగా.. చివరి మూడు రోజుల్లో 1.10 లక్షల దరఖాస్తుల రావడం గమనార్హం. గ్రూపు 2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు. ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తరువాత పరీక్ష తేదీని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. 

Also Read :  బాలయ్య అభిమానులకు శుభవార్త.. ఆ హిట్ సాంగ్ రిమిక్స్..!

Visitors Are Also Reading