ఏపీలో సినిమా టికెట్ల ధరపై పెద్ద రచ్చ జరుగుతున్నది. ఏపీలో టికెట్ల ధరలు పెంచేందుకు ప్రభుత్వం ఏమాత్రం అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వ నిబంధనల మేరకే టికెట్ల ధరలు ఉండాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఏపీలో టికెట్ల ధరలు ఇలా ఉంటే, తెలంగాణలో టికెట్ల ధరలపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరలను పెంచేందుకు కేసీఆర్ సర్కార్ అనుమతి ఇచ్చింది. అధికారుల కమిటీ సిఫారసుల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏసీ థియేటర్లలో కనిష్ట ధర 50 కాగా, గరిష్ట ధర 150 గా ఉంది. అలాగే, మల్టీప్లెక్స్‌లలో కనిష్ట ధర 100 కాగా, గరిష్ట ధర 250గా ఉంది. రిక్లయినర్ సీట్లకు గరిష్టంగా 300 వరకు వసూలు చేసుకోవచ్చు. దీనికి జీఎస్టీ, నిర్వహణ చార్జీలు దనం. నిర్వహణ చార్టీల కింద ఏసీ థియేటర్లలో టికెట్‌కు 5 రూపాయలు, నాన్ ఏసీ థియేటర్లలో టికెట్‌కు 3 రూపాయల చొప్పున వసూలు చేసేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం.
Advertisement