Home » బిగ్ అలర్ట్‌.. ఈ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుల స్వీకరణకు ఇలా చేయండి !

బిగ్ అలర్ట్‌.. ఈ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుల స్వీకరణకు ఇలా చేయండి !

by Bunty
Ad

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది కేసీఆర్ సర్కారు. ఇక తాజాగా మరోసారి విద్యార్థులకు, నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది.

Advertisement

రాష్ట్రంలోని భూగర్భ జల విభాగానికి చెందిన కింది పోస్టులకు టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. 06-12-2022 తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 27-12-2022తో ముగియనుంది.

 

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు,

* నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Advertisement

 

* వీటిలో అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ జియోఫిజీసిస్ట్, హైడ్రాలజిస్ట్ పోస్టులు ఉన్నాయి.

 

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ ఎంఎస్సి /ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

 

* అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

 

ముఖ్యమైన విషయాలు,

 

* ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 

* అభ్యర్థులను పరీక్షలు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.45,960 నుంచి రూ.1,33,630 వరకు చెల్లిస్తారు.

 

* 06-12-2022 తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 27-12-2022 తో ముగియనుంది.

Visitors Are Also Reading