తెలంగాణ ప్రభుత్వం మరొక కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల కోసం నూతన బీమా పథకాన్ని ప్రారంభించనుంది. నేతన్నల సంక్షోమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ వివరించారు. చేనేత మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిచేందుకు రైతు బీమా మాదిరిగానే నేతన్న బీమా పథకాన్ని అమలు చేయనున్నట్టు వెల్లడించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 07న నేతన్న బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు.
బీమా కాలంలో లబ్ధిదారులైన చేనేత, మరమగ్గాల కార్మికులు ఎవరు అయినా దురదృష్టవశాత్తు మరణించినట్టయితే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా సంబంధిత వ్యక్తి నామినికి రూ.5లక్షలు అందజేస్తామని తెలిపారు. 10 రోజుల్లో ఈ మొత్తం వారి బ్యాంకు ఖాతా జమ అవుతుందని మంత్రి ప్రకటించారు. మంత్రి కేటీఆర్ ఈనెల 07న నేతన్న బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. రైతు బీమా తరహాలోనే నేతన్నకు ఈ బీమా పథకం వర్తింపజేయనున్నారు. దీంతో రాష్ట్రంలోని సుమారు 80వేల మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరనుంది.
Advertisement
Advertisement
ఇక 60 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి నేత కార్మికుడు ఈ పథకానికి అర్హుడిగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. దురదృష్టవశాత్తు నేత కార్మికులు మరణిస్తే రూ.5లక్షల బీమా పరిహారం వారి కుటుంబానికి అందించనుంది ప్రభుత్వం. ఈ పథకం కోసం చేనేత, జౌళి శాఖ నోడల్ ఏజెన్సీ గా ఉండనుంది. నేతన్న బీమా కోసం ఎల్ఐసీతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వార్షిక ప్రీమియం కోసం చేనేత పవర్ లూమ్ కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని.. రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్ల కేటాయించింది. ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read :
శ్రీకృష్ణుడి మరణ రహస్యం గురించి మీకు తెలుసా..?
కళ్యాణ్ రామ్ సంచలన నిర్ణయం.. అలా జరిగితే సినిమాలు మానేస్తా..!