Home » తెలంగాణ రైతులకు భయం వద్దు.. సీఎస్ సోమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణ రైతులకు భయం వద్దు.. సీఎస్ సోమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు..!

Ad

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా వరి చేను కోసి ధాన్యాన్ని మార్కెట్ యాడ్ లకు తరలించారు. ధాన్యం కొనుగోలు పై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సీఎస్ సోమేష్ కుమార్ శుభవార్త చెప్పారు. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి సమస్య లేదని, రైతులకు డబ్బులు చెల్లించడం కోసం ఇప్పటికే ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయలను కేటాయించిందని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై గురువారం బిఆర్ కెఆర్ భవనంలో పౌరసరఫరాల మార్కెటింగ్ అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మొత్తం ధాన్యం కొనుగోలు సాఫీగా సాగుతున్నాయని తెలియజేశారు.

Advertisement

Advertisement

ఇప్పటికే 4.61 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని అన్నారు. రాష్ట్రం మొత్తం 3679 కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలియజేశారు. 7.80 కోట్ల గన్ని బ్యాగులు రైతులకు అందుబాటులో ఉన్నాయని, ఎనిమిది కోట్ల బ్యాగుల కొరకు టెండర్ ప్రక్రియ పూర్తవుతుందని, మరొక రెండున్నర కోట్ల బ్యాగులు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వస్తాయని తెలియజేశారు.

మరి ఏ ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా ఉండటం కోసం 17 జిల్లాల్లో సరిహద్దు ప్రాంతాల్లో 51 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 4.3 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం మిల్లులకు పోయిందని, గద్వాల్,వరంగల్, భూపాలపల్లి, వనపర్తి, జిల్లాలలో వరి కోతలు అనేది ఆలస్యంగా అవుతాయని, ఆ సమయంలోనే అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సోమేశ్ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో రైతన్నలు ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Visitors Are Also Reading