Home » ఏపీపై తెలంగాణ ఎఫెక్ట్.. ఓటర్లు ఎటువైపు.. ఆ పార్టీకి డేంజర్ బెల్స్..!

ఏపీపై తెలంగాణ ఎఫెక్ట్.. ఓటర్లు ఎటువైపు.. ఆ పార్టీకి డేంజర్ బెల్స్..!

by Anji
Ad

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వీడ్కోలు పలికి కాంగ్రెస్ ప్రభుత్వానికి స్వాగతం పలికారు ప్రజలు. ఇక త్వరలో పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. తెలంగాణ ఎన్నికల ఫలితాల సరళి ఏపీకి ఏం సందేశం ఇస్తోంది. ఏపీ మూలాలు ఉన్న తెలంగాణ ఓటర్లు తమ మనస్సులో ఉన్న అభియాప్రాయాన్ని ఓటుతో స్పష్టం చేశారు. ఏపీలో మూడు ప్రధాన పార్టీలకు హెచ్చరికలా మారింది. వైసీపీ, టీడీపీ, జనసేనలకు ఈ ఫలితాలు కలిసి వస్తాయా..? నష్టం చేస్తాయా.?  అసలు ఏం జరుగుతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ కి నష్టం జరిగిన విధంగానే.. ఇప్పుడు ఏపీలో సీఎం జగన్ కి అలాంటి ఫలితాలే వస్తాయని టీడీపీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు. వాస్తవానికి టీడీపీ తెలంగాణలో పోటీ చేయలేదు. టీడీపీ మద్దతు దారులు మాత్రం కాంగ్రెస్ కి అండగా నిలుస్తామని చెప్పారు. కొంతమంది టీడీపీ నేతలు బీఆర్ఎస్ లో చేరితే.. మరికొందరూ కాంగ్రెస్ లో చేరారు. సెటిలర్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎల్బీనగర్, కూకటల్ పల్లి, రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. మరోవైపు తెలంగాణలో బీజేపీతో కలిసి చేసింది జనసేన.  పవన్ పార్టీ పోటీ చేసిన 8 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు అయ్యాయి.  పవన్ సభకు జనాలు పోటెత్తారు. కానీ ఓట్లు మాత్రం ఒక్కరూ కూడా వేయలేదు.

Advertisement


పవన్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నప్పటికీ ఓట్లు పడేది లేదని స్పష్టమవుతోంది. బీజేపీ ఆలోచనలోనూ మార్పు వచ్చే అవకాశం ఉంది. ఒంటరిగా బీజేపీ నేతలు ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఆ పార్టీ ఎనిమిది స్థానాలు దక్కించుకుంది. దీంతో, ఏపీలో ఏ వ్యూహంతో వెళ్లాలనేది బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ ఓడటంతో జగన్ కు నష్టమనే ప్రచారం టీడీపీ మద్దతు దారుల్లో మొదలైంది.  కేసీఆర్ తెలంగాణలో పదేళ్లు పరిపాలించారు. కానీ జగన్ 2019లోనే సీఎం అయ్యారు. కేవలంలో ఐదేళ్లు మాత్రమే అవుతుంది.  అయితే ఏపీలో పరిస్తితులు వేరు.. తెలంగాణలో పరిస్థితులు వేరు. కేసీఆర్ రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకపోవడంతో నిరుద్యోగులంతా కాంగ్రెస్ కి ఓట్లు వేశారు. మరోవైపు కాంగ్రెస్ 6 గ్యారెంటీల హామీలతో ముందుకు వచ్చి విజయం సాధించింది. ఏపీలో గెలిచే వారికి సీట్లు అని.. అటు చంద్రబాబు.. ఇటు జగన్ చెబుతున్నారు. కానీ ఎవ్వరూ గెలుస్తారో వేచి చూడాలి మరీ.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading