తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. 2023 రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ఆచార్య లింబాద్రి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి, ఎడ్ సెట్ చైర్మన్ ఆచార్య గోపాల్ రెడ్డి, కన్వీనర్ ఆచార్య రామకృష్ణ దరఖాస్తుల షెడ్యూల్ ను మార్చి 4న విడుదల చేశారు.
Read Also : అన్న కొడుకు కోసం బాలయ్య తపన.. కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి
Advertisement
Advertisement
ఆసక్తి కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు రూ. 500, ఇతరులు రూ.700 దరఖాస్తు ఫీజు చెల్లించాలని నిర్ణయించినట్లు లింబాద్రి తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో రెండు సంవత్సరాల BEd రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TSCHE) తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎడ్ సెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 18వ తేదీన రాత పరీక్షను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఇతర వివరాలు నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు.
READ ALSO : మార్చి 6 నుంచి గ్రూప్-1 మెయిన్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే