Home » TS: ముందస్తు ఎలక్షన్స్.. కలవర పెడుతున్న సర్వే రిపోర్ట్.. వారికే అనుకూలమా..?

TS: ముందస్తు ఎలక్షన్స్.. కలవర పెడుతున్న సర్వే రిపోర్ట్.. వారికే అనుకూలమా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎలక్షన్ టైం ఏడాదికి పైగానే ఉంది.. కానీ ఒకవేళ ముందస్తు వచ్చే అవకాశం ఉందని అన్ని రాజకీయ పార్టీల నాయకులు వారి వారి నియోజకవర్గాల్లో చాలా స్పీడ్ గా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు వారి వారి నియోజకవర్గాల్లో జాతకాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకుంటున్నారు.. వారి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, రాజకీయ భవిష్యత్తు ఉందా లేదా అని తలకిందులు పడుతున్నారు..

also read:దీపికా ఆ డ్రెస్సు వేసుకుంటే తప్పేంటి..? ప్ర‌కాష్ రాజ్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్..!

Advertisement

నాయకులంతా సర్వేల చెంత :
ముందస్తు ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.. ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు అని ప్రకటించడంతో వారంతా సంతోషంగా ఉన్నారు. వారి వారి కాన్స్టెన్సీ లో అభివృద్ధి పనులతో చాలా బిజీగా ఉన్నారు. ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చిన క్షణాల్లో వాలిపోతున్నారు. ఎలాగైనా మళ్ళీ టికెట్ తెచ్చుకొని గెలవాలని ఆశతో ముందుకు సాగుతున్నారు. కొంతమంది ఆశావాహులు మాత్రం టికెట్ కోసం ప్రతిసారి ఎదురు చూసి విఫలమవుతున్నారు. అలాంటి వారికి ఈసారి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

వారు కూడా ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో అని చెక్ చేయించుకుంటున్నారు. సొంత డబ్బులతో సర్వేలు కూడా నిర్వహించుకుంటూ ముందుకు సాగుతున్నారు.. తెలంగాణలో గతంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ టికెట్ వస్తుందని కేసీఆర్ ప్రకటించారు. ఉన్న ఎమ్మెల్యేలు ఒకరిద్దరు తప్ప అందరికీ టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై కెసిఆర్ సర్వేలు నిర్వహించి ఎవరికి టికెట్ ఇయ్యాలో డాటా తెప్పించుకున్నారట. ఒకవేళ ప్రజల్లో గ్రాఫ్ పడిపోయిన ఎమ్మెల్యేలను తీసివేసి మళ్ళీ అక్కడ ఎవరిని పెట్టాలని ఆలోచనతో కేసీఆర్ ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది..

Advertisement


కాంగ్రెస్ పరిస్థితి:
రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ లో కాస్త జోష్ పెరిగింది.. కానీ పార్టీలో ఉండేటువంటి కొంతమంది పెద్ద నాయకుల వల్ల లోలోపల అనేక ఇబ్బందులు చేస్తూ పార్టీని నీరుగార్చే పనులు చేస్తున్నారు. దీనివల్ల కేడర్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చీప్ అయిపోతుంది.. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించే వ్యక్తులు గ్రామాల్లో వారి వారి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. వాడు కూడా సర్వేలు నిర్వహించుకుంటూ వారి భవితవ్యాన్ని తెలుసుకుంటున్నారు..


ఛాన్స్ కోసం బిజెపి :
ఇక తెలంగాణలో బిజెపి ఈసారి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను తయారు చేస్తూ ముందుకు సాగుతోంది. వచ్చిన ప్రతి ఛాన్స్ ను ఉపయోగించుకుంటూ అసంతృప్తి నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానం పలుకుతోంది. ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఆలోచనతో అడుగులు వేస్తోంది.
అడుగడుగునా సర్వే :
ఈ విధంగా తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల ఎమ్మెల్యే టికెట్ ఆశించే నాయకులు వారి వారి నియోజకవర్గాల్లో తిరుగుతూ వారి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో సర్వేలు నిర్వహిస్తూ రాబోవు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

also read:Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Visitors Are Also Reading