తెలంగాణలో జులై 14, 15 తేదీల్లో జరగాల్సిన తెలంగాణ ఎంసెట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కుస్తున్న కారణంగా రేపు, ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి ఓ ప్రకటనలో పేర్కొంది. వాయిదా పడ్డ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు అధికారులు.
ఇదిలా ఉండగా.. ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎంసెట్ పరీక్షల తేదీలలో ఎలాంటి మార్పులు లేవని అధికారులు వెల్లడించారు. జులై 18, 19, 20 తేదీలలో షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నారు. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎంసెట్ నిర్వహించేందుకు అధికారులు ఇంకా అక్కడక్కడ ఏర్పాట్లు చేయలేదు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో ఎంసెట్ కేంద్రాలు నీట మునిగాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.ఈ తరుణంలో ఎంసెట్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి.
Advertisement
Advertisement
వారి డిమాండ్‌లను వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణలోకి తీసుకుని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంసెట్ అగ్రికల్చర్ మెడికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ప్రధానంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకూడదని పరీక్షలను వాయిదా వేశారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులతో సమీక్షించిన తరువాత అనంతరం పరీక్షలను వాయిదా వేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ఒక ప్రకటన విడుదల చేసారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఎంసెట్ పరీక్షకు మొత్తం 2.6 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Also Read :
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు జాగ్రత్త ..!