Home » తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వ‌చ్చేసింది.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..!

తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వ‌చ్చేసింది.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..!

by Anji

తెలంగాణ ఎంసెట్ ఫ‌లితాలు ఇవాళ ఉద‌యం విడుద‌లైన విష‌యం తెలిసిందే. అయితే ఎంసెట్ కి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ని అధికారులు తాజాగా విడుద‌ల చేశారు. మూడు ఫేజ్ ల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్ర‌క్రియ ఈనెల 21న ప్రారంభం కానున్న‌ది. తుది విడుత సీట్ల కేటాయింపు అక్టోబ‌ర్ 17తో ముగియ‌నున్న‌ది. దీనికి సంబందించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

  • ఆగ‌స్టు 21 నుంచి 29 వ‌ర‌కు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్
  • 23వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్
  • 23 నుంచి సెప్టెంబ‌ర్ 02 వ‌ర‌కు విద్యార్థులు వెబ్ ఆప్ష‌న్లు ఇవ్వాల్సి ఉంటుంది.
  • సెప్టెంబ్ 6 తేదీన ఇంజినీరింగ్ విభాగంలో మొద‌టి విడ‌త సీట్ల‌ను కేటాయిస్తారు.సెప్టెంబ‌ర్ 28 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుంది.

  • సెప్టెంబ‌ర్ 28, 29 తేదీల్లో రెండ‌వ విడుత స్లాట్ బుకింగ్ ఉంటుంది.
  • సెప్టెంబ‌ర్ 30న సెకండ్ ఫేజ్ స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్
  • సెప్టెంబ‌ర్ 28 నుంచి అక్టోబ‌ర్ 01 వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్ల న‌మోదు ఉంటుంది.
  • అక్టోబ‌ర్ 4న సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు.

  • అక్టోబ‌ర్ 11 నుండి ఫైన‌ల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం.
  • అక్టోబ‌ర్ 13న తుది విడుత స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్ ఉంటుంది.
  • అక్టోబ‌ర్ 11 నుంచి 14 వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్ల న‌మోదు.
  • అక్టోబ‌ర్ 17న ఫైన‌ల్ ఫేజ్ ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
  • అక్టోబ‌ర్ 20న స్పాట్ అడ్మిష‌న్ల‌కు సంబంధించి గైడ్ లైన్స్ అధికారులు విడుద‌ల చేయ‌నున్నారు.
  • విద్యార్థులు ఎంసెట్ కౌన్సెలింగ్ కి సంబంధించి అప్‌డేట్స్ కోసం https://eamcet.tsche.ac.in వెబ్‌సైట్ సంద‌ర్శించాలని ఎంసెట్ అధికారులు సూచించారు.

Also Read : 

Vidura Niti : విదురుడు చెప్పిన ఈ నియమాలు పాటిస్తే మీకు తిరుగుండ‌దు..!

ప్రజలు థియేటర్ కు రావాలంటే అదే చేయాలంటున్న నిఖిల్…!

Visitors Are Also Reading