తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ ఈ వారంలో విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మార్చి మొదటి వారంలో ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మొదలయ్యేలా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(TSCHE) ప్రణాళిక రూపొందిస్తుంది. ఇక గడిచిన మూడేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇంటర్ మార్కులను 25% వెయిటేజీని తొలగించాలని అధికారులు భావిస్తున్నారు.
Advertisement
Advertisement
ఇందుకోసం ప్రభుత్వం త్వరలోనే జీవో జారీ చేయనుంది. నోటిఫికేషన్ జారీ నాటికి జీవో రాకుంటే తర్వాత సర్కారు జారీ చేసే జీవోను అనుసరించి వెయిటేజ్ పై నిర్ణయం ఉంటుందని అందులో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70% సిలబస్ నుంచి ఎంసెట్ లో ప్రశ్నలు వస్తాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ఇంజనీరింగ్ కాలేజీ ల్లో బిటెక్, భీఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతి ఏటా ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
read also : Mangli : మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. ఈ సారి ఏం జరిగిందంటే..!